YS Viveka Murder Case Update: వైఎస్ వివేకానంద రెడ్డి కేసు మిస్టరీ వీడనే లేదు. సాక్షులు మాత్రం ఒక్కక్కరిగా మరణిస్తున్నారు. 2019 లో కడపలోని ఆయన స్వంత ఇంటిలోనే మార్చి 15వ తేదీ అత్యంత దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. మొదటగా ఆయన మరణించింది హార్ట్ అటాక్ అని చెప్పారు ఆ తర్వాత ఆయన హత్యకు గురైనట్లు నిర్ధారించారు. అయితే, ఈ కేసు అప్పటి నుంచి మిస్టరీగానే మారింది. తాజాగా ఆ ఇంటి వాచ్‌మెన్ రంగయ్య (70) అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. ఈ హత్యకు సంబంధించి సీబీఐకు రంగయ్య అన్ని పూసగుచ్చినట్లు చెప్పారు. ఇతను కీలక సాక్షం కావడతో ఇద్దరు పోలీసులను కూడా రంగయ్యకు రక్షణగా ఏర్పాటు చేశారు.
సాక్షులుగా ఉన్న వ్యక్తుల వరుసగా చనిపోతున్నారు. కీలకంగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి 2019 లో అనుమానాస్పదంగా చనిపోయారు. మరో సాక్షి గంగాధర్ రెడ్డి 2022 జూన్‌లో చనిపోయారు. ఇక వైఎస్ వివేకాకు కుట్లు వేసిన వైఎస్ భారతి రెడ్డి తండ్రి డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కూడా మరణించాడు. ఇటీవలె వైఎస్ జగన్ తమ్ముడు అభిషేక్ రెడ్డి కూడా చిన్న వయస్సులోనే మరణించారు. తాజాగా వివేక్ వాచ్‌మెన్ రంగయ్య చనిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
READ ALSO: పీఎం ఉజ్వల యోజన 3.0 పథకానికి దరఖాస్తు చేస్తున్నారా? అర్హులు ఎవరు తెలుసా?
దీంతో ఈ వరుస మరణాలు వివేకా హత్యకేసుపై పలు అనుమానాలకు తావు ఇస్తున్నాయి. ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. రంగన్నకు ఈరోజు రిమ్స్ వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు.కానీ, కుటుంబ సభ్యులు మాత్రం వయస్సురీత్యా వచ్చే అనారోగ్య సమస్యలు, చికిత్సకు సహకరించక మరణించినట్లు చెబుతున్నారు. ఈ కేసు పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. 2019 ఎన్నికల ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్లిన తర్వాత ఈ మర్డర్ జరిగింది. అప్పటి నుంచి ఆయన కూతురు సునీత రెడ్డి పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే, ప్రధానంగా ఈ కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి పాత్ర ఉందని చెబుతున్నారు. ఐదు మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్నవారు ఇప్పటికే మరణించారు. ఈ కేసు ఎక్కడికి దారి తీస్తుందో తెలుసుకోవాలి.
READ ALSO: తెలంగాణలో ఉగాది కానుక.. రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి సునీతా పోరాటం చేస్తుంది. అయితే ఈ కూటమి ప్రభుత్వ హయాంలో అయినా తన నాన్న కేసులో పురోగతి దొరుకుందేమోనని పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ, కేసు మరింత ముందుకు వెళ్తుంది అనుకున్నారు. కానీ, రాను రాను పరిస్థితులు క్లిష్టంగా మారుతుంది. కీలక అంశాలు ఇప్పటికే రంగన్న సీబీఐకు చెప్పారు. ఇక దీనిపై సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది చూడాలి. కేసు రీఓపెన్ చేస్తే వైఎస్ హత్య కేసు ఎవరు చేసారని తేలుతుందా? లేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









