Delimitation: నియోజకవర్గాల పునర్విభజనపై జగన్ స్టాండ్ ఇదే, ప్రదాని మోదీకు లేఖ

Delimitation: నియోజకవర్గాల పునర్విభజనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్టాండ్ ఏంటో చెప్పేశారు. తమిళనాడు వేదికగా ప్రారంభమైన సమావేశానికి హాజురుకాకున్నా..తన వైఖరేంటో సుస్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 22, 2025, 02:05 PM IST
Delimitation: నియోజకవర్గాల పునర్విభజనపై జగన్ స్టాండ్ ఇదే, ప్రదాని మోదీకు లేఖ

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన అంశంపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన మొదలైంది. జనాభా ప్రాతిపదికగా పునర్విభజన అనేది దక్షిణాదికి నష్టం చేకూర్చనుండటంతో డీఎంకే ఆందోళన మొదలుపెట్టింది. అన్ని పార్టీలను ఆహ్వానించింది. ఈ సమావేశానికి వైఎస్ జగన్ హాజరు కాకపోయినా తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. 

Add Zee News as a Preferred Source

దేశంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై
డీఎంకే నేతృత్వంలో జరుగుతున్న సమావేశంలో వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఈ భేటీకు హాజరవుతారని భావించినా ఆయన దూరమయ్యారు. కానీ తన వైఖరి తెలుపుతూ ప్రధాని మోదీకు లేఖ రాశారు. జనాభా లెక్కల ప్రకారం డీ లిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గత 15 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం కోరిన విధంగానే జనాభా నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేశాయని జగన్ గుర్తు చేశారు. అందుకే డీ లిమిటేషన్ జనాభా ప్రాతిపదికన లేకుండా చూడాలన్నారు. 

జగన్ రాసిన లేఖలోని ముఖ్యాంశాలు

లోక్‌సభ, రాజ్యసభలో వివిధ రాష్ట్రాలకు ఇప్పుడు ఉన్న సీట్ల సంఖ్యను తగ్గించకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలి. 2021లో జరగాల్సిన జనాభా లెక్కింపు కోవిడ్ కారణంగా జరగనందున 2026 నాటికి చేపట్టి దాని ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నారని తెలుస్తోంది. అందుకే ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే తమ ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. జనాభా నియంత్రణ దేశమంతా ఒకే రీతిన జరగకపోవడంతో జనాభా పెరుగుదల వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంది. ఇది కచ్చితంగా డీ లిమిటేషన్‌పై ప్రభావం చూపిస్తుంది. 1971 నుంచి 2011 వరకు 40 ఏళ్లలో కూడా దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా గణనీయంగా తగ్గింది. 2011 నుంచి ఇప్పటి వరకూ మరింత తగ్గింది. 

1971 లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల జనాభా వృద్ధి రేటు 24.08 శాతంగా ఉంటే 2011 లెక్కల్లో అది కాస్తా 20.88 శాతానికి తగ్గింది. ఇక 2011 నుంచి 2026 వరకూ పరిగణలో తీసుకుంటే 15 శాతానికి పడిపోయి ఉండవచ్చని అంచనా. ఈ క్రమంలో జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం లోక్‌సభలో పరిగణలో తీసుకోనంతగా ఉంటుంది. 

అందుకే జనాభా ప్రాతిపదికన డీ లిమిటేషన్ వద్దని కోరుకుంటున్నాం. దామాషా ప్రకారం ప్రతి రాష్ట్రానికి సీట్ల కేటాయింపు చేయాలంటే ఆర్టికల్ 81(2)(ఎ) సవరణ చేయాల్సి ఉంటుంది. డీ లిమిటేషన్‌పై వస్తున్న అభ్యంతరాలు దేశ సామాజిక, రాజకీయ సామరస్యతను, ఇంటిగ్రిటీని దెబ్బతీసే అవకాశం ఉంది. 

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నైలో జరుగుతున్న భేటీకు హాజరవకుండానే తన వైఖరేంటో స్పష్టం చేయగలిగారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయవద్దని కోరారు. ఇది కచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం తగ్గిస్తుందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. 

Also read: IPL 2025 New Rules: నేటి నుంచి ఐపీఎల్ 2025 సీజన్ 18, కొత్త రూల్స్ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News