Ys Jagan on ChandrababU: గొప్పలు చెప్పుకోవడమే...మీ వల్ల రాష్ట్రానికేం ఉపయోగం

Ys Jagan on ChandrababU: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా ఎక్స్‌లో కీలక వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 2, 2025, 05:25 PM IST
Ys Jagan on ChandrababU: గొప్పలు చెప్పుకోవడమే...మీ వల్ల రాష్ట్రానికేం ఉపయోగం

Ys Jagan on ChandrababU: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎక్స్ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. అనుభవం గురించి గొప్పలు చెప్పుకోవడమే తప్ప రాష్ట్రానికి ఏం మేలు జరిగిందని ప్రశ్నించారు. నలభై ఏళ్ల ఇండస్ట్రీ చెప్పుకోవడానికే మిగిలిందని ఎద్దేవా చేశారు. 

Add Zee News as a Preferred Source

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది. ఈ సందర్భంగా అటు ప్రభుత్వం ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు ఎప్పుడూ తన నలభై ఏళ్ల అనుభవం అని గొప్పలు చెప్పుకుంటారని, వాస్తవానికి ఆయన అనుభవం ఎన్నడూ రాష్ట్రానికి ఉపయోగపడింది లేదని విమర్శించారు. తమ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో తీసుకున్న రుణంలో 44 శాతం కేవలం ఏడాది వ్యవధిలోనే కూటమి ప్రభుత్వం తీసుకుందని ఆరోపించారు. అదే సమయంలో ఏడాది కాలంలో చెప్పుకోదగిన సంక్షేమ పధకాలు లేదా అభివృద్ధి ఎందుకు లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. 

ఆర్ధిక నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ ఎంత అసమర్థంగా పనిచేస్తుదో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక  విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయని జగన్ విమర్శించారు. స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తిలో ఆర్ధిక లోటు గతంలో 4.08 శాతం ఉంటే ఇప్పుడు 5.12కు పెరిగిందని వివరించారు. జీఎస్‌డీపీలో రెవిన్యూ లోటు కూడా 2.65 శాతం నుంచి 3.61 శాతానికి పెరిగిందన్నారు. రాష్ట్ర అప్పులు జీఎస్‌డీపీలో 35.64 శాతం ఉండటం ఆందోళనకరమన్నారు. 

2024-25 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం తీసుకున్న రుణాల్లో కేవలం 23.49 శాతమే మూలధన వ్యయం కోసం కేటాయించినట్టు జగన్ తెలిపారు. తమ హయాంలో మూలధన వ్యయం కోసం అప్పుల నుంచి 33.25 శాతం కేటాయించామని గుర్తు చేశారు. చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో పోతోందని ఆరోపించారు. అభివృద్ధి సంక్షేమం పేరుతో ప్రజల్ని మభ్యపెడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెడుతున్నారని మండిపడ్డారు. దశాబ్దాల అనుభవం ఏమైందని, రాష్ట్రానికి ఎప్పుడు ఎలా ఉపయోగపడిందో చెప్పాలని నిలదీశారు. 

Also read: Summer Alert: నైరుతి మందగమనం, మళ్లీ పెరిగిన ఎండలు ఉక్కపోత ఈ జిల్లాలకు వార్నింగ్

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Trending News