Ys jagan emotional video viral: ఆంధ్ర ప్రదేశ్ లో కొన్నిరోజులుగా వైఎస్ జగన్ తన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలతో ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి యర్రం పిచ్చమ్మ సోమవారం చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో బాపట్ల జిల్లా మేదరమెట్లకు చేరుకున్న వైఎస్ జగన్.. వైవీ సుబ్బారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అంతే కాకుండా.. తన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి పిచ్చమ్మ పార్థీవదేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు.
అనంతరం సుబ్బారెడ్డి విజయమ్మ, వైఎస్ జగన్ ఓదార్చారు. అప్పుడు ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వైఎస్ జగన్ కూడా.. తన తల్లిని చూసి ఎమోషనల్ అయ్యారు. చాలా రోజుల తర్వాత తల్లికొడుకు ఒకే చోట కన్పించడంతో.. జగన్ తన తల్లిని మనసారా హత్తుకున్నారు. దీంతో ఇద్దరి కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. అయితే.. గత కొన్నినెలలుగా వైఎస్ కుటుంబం మధ్య ఆస్తి తగాదాలు పీక్స్ కు చేరాయి. ముఖ్యంగా ఆస్తులు వాటాల పంపకంలో తనకు అన్యాయం జరిగిందని వైఎస్ షర్మిల బహిరంగానే జగన్ ను తీవ్రంగా విమర్శలు చేశారు.
బాపట్ల జిల్లా మేదరమెట్లలోని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసంకి వెళ్లి ఆయన మాతృమూర్తి పిచ్చమ్మ పార్ధీవదేహానికి వైయస్ జగన్ గారు నివాళులు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకి పరామర్శ.#YSJagan#AndhraPradesh pic.twitter.com/jd74eUHIta
— YSR Congress Party (@YSRCParty) March 18, 2025
అంతే కాకుండా... తల్లికి, చెల్లెకి న్యాయం చేయలేని వాడు.. ఏపీ ప్రజలకు ఏంచేస్తాడని కూడా పదే పదే.. జగన్ ను కార్నర్ చేశారు. ఒక రకంగా వైఎస్ జగన్ ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి వైఎస్ షర్మిల కూడా ఒక కారణంగా చెప్పుకొవచ్చు.
ఈ నేపథ్యంలో జగన్ ఈరోజు తన తల్లితో ఆప్యాయంగా పలకరించడం, హత్తుకొవడం ఘటన సైతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన వైఎస్ జగన్ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. జగన్ తన తల్లిని హత్తుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది వైఎస్ అభిమానులు మరల తల్లి ప్రేమ ఎక్కడకు పోతుందీ.. ఆ అనుబంధాన్ని ఏ గొడవలు విడదీయలేవని కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా జగన్ తన తల్లితో మరల కలవడం ఆనందంగా ఉందని వైఎస్ అభిమానులు ప్రస్తుతం ఫుల్ పండగ చేసుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter