
Botsa Satyanarayana: రేపటి నుంచి ప్రారంభమవుతున్న తల్లికి వందనం పథకంపై వైఎస్సార్సీపీ సంచలన ఆరోపణలు చేసింది. తల్లికి వందనం కాదని చంద్రబాబు తల్లికి వంచన అని ఆరోపించింది. వెచ్చించిన నిధుల్లో చాలా మంది తల్లులకు అన్యాయం జరుగుతోందని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టారని.. ఇప్పుడు మళ్లీ వంచన చేస్తున్నారని మండిపడ్డారు.
తల్లికి వందనం పథకం ప్రారంభంపై బొత్స సత్యనారాయణ స్పందిస్తూ ప్రభుత్వానికి కీలక ప్రశ్నలు విధించారు. 'మొత్తం పిల్లలు 87,41,885, ఇస్తామంటున్నది 67,27,164 మందికి, కాని ప్రకటించిన నిధులు ప్రకారం చూస్తే 58 లక్షల మందికే అది కూడా పూర్తిగా ఇస్తారో లేదో?' అని బొత్స సత్యనారాయణ ప్రకటించారు. దాదాపుగా 29 లక్షల మంది పిల్లలకు మోసమే కదా? అని ప్రశ్నించారు. పథకం అమలుకు కావాల్సింది ఏడాదికి రూ.13,050 కోట్లు, రెండేళ్లకు ఇవ్వాల్సింది రూ.26,100 కోట్లు, ఈ ఏడాది రూ.8,745 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఇది వంచన కాదా?' అని బొత్స సత్యనారాయణ నిలదీశారు.
వైఎస్సార్ సీపీ ప్రశ్నలు
1. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఏడాదిపాటు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అరాచకంగా పరిపాలన చేసింది. చేసిన వాగ్దానాలను అమలు చేయాలనే చిత్తశుద్ధి కనిపించడం లేదు. ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. తల్లికి వందనంతో ప్రజలను ఏరకంగా వంచిస్తున్నారో అర్థమవుతోంది. మేం అమ్మ ఒడి పథకం ప్రతియేటా క్రమం తప్పకుండా అమలు చేయగా.. ఆ పథకాన్ని రద్దు చేసి తల్లులకు డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టారు.
2. రాష్ట్రంలో మొత్తంగా ఉన్న పిల్లలు 87,41,885 కానీ ప్రభుత్వం 67,27,164 మంది మాత్రమే ఇస్తామంటోంది. తీరా ప్రకటించిన డబ్బులు చూస్తే కేవలం 58 లక్షల మందికే. ఇది మోసం కాదా? వంచన కాదా?
3. యూడీఐఎస్ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో విద్యార్థులు దాదాపుగా 87,41,885 మంది ఉన్నారు. మేనిఫెస్టోలో ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఇస్తామని.. దీని ప్రకారం మొత్తంగా ఏడాదికి ఇవ్వాల్సింది రూ.13,050 కోట్లు. కానీ గతేడాది ఒక్కపైసా ఇవ్వలేదు.
4. గతేడాది బకాయిలతో కలిపి ఈ ఏడాది చెల్లించాల్సింది రూ.26,100 కోట్లు. కాన ఈ ఏడాది రూ.8,745 కోట్లు మాత్రమే ఇస్తున్నట్టు మంత్రి ట్వీట్ చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇస్తే ఈ డబ్బులు కూడా సంపూర్ణంగా ఇస్తే కేవలం 58 లక్షల మందికే సరిపోతాయి. అంటే 29 లక్షల మంది పిల్లలకు ఎగనామం పెడుతున్నట్టేగా?
5. ప్రాంతం, మతం, కులం, పార్టీలు చూడకుండా అందరికీ పథకాన్ని వర్తింపచేస్తే ఈ ప్రభుత్వం 67,27,164 మంది విద్యార్థులకు మాత్రమే పథకాన్ని వర్తింపుచేస్తామని విద్యా శాఖ మంత్రి చెబుతున్నారు. ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున రూ.10,090.75 కోట్లు ఇవ్వాలి, కాని రూ.8,745 కోట్లు మాత్రమే ప్రకటించడం చూస్తే ఇది మోసమే అని తేలిపోయింది.
6. ఈ అంకెలు చూస్తే ఏదోరకంగా మభ్యపెట్టేలా ప్రభుత్వ ధోరణి కనిపిస్తోంది. ఇది మహిళలను మోసం చేస్తున్నట్టు కాదా? తల్లులను వంచిస్తున్నట్టు కాదా? తల్లికి వందనం కాదు, ఈ ప్రభుత్వం చేస్తున్న వంచన ఇది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook