Election Betting On YS Jagan: అభిమానం అనేది ఏ రూపంలో చూపించవచ్చు. తమకు ఇష్టమైన వారిపై ఉన్న అభిమానాన్ని చూపించేందుకు కొందరు చిత్ర విచిత్ర వేషాలు వేస్తుంటారు. సినీ నటులు, రాజకీయ నాయకులపై ఉండే అభిమానం చెరగనిది. కొందరైతే అభిమానం కోసం ప్రాణాలు కూడా తీసుకునే పీక్స్‌కు ఫ్యానిజం ఉంటుంది. ఇన్నాళ్లు గుళ్లు గోపురాలు, రక్తపాతాలు జరగ్గా తాజాగా ఓ అభిమాని అరగుండు గీయించుకుని రోడ్లపై హల్‌చల్ చేశాడు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం ఆ అభిమాని చేసిన సాహసం రాజకీయంగా చర్చనీయాంశం కాగా ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
Also Read: YS Jagan: హీరోను తలచుకుని మాజీ సీఎం వైఎస్ జగన్ భావోద్వేగం
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓడిపోవడంతో తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం ఉనగట్లకు చెందిన వీరవల్లి శివ రామకృష్ణ అలియాస్ శివ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. రెండోసారి మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అవుతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. వైఎస్సార్‌సీపీ తిరిగి విజయం సాధిస్తుందని భావించాడు. ఎన్నికల సమయంలో ఇదే మాటపై భారీగా బెట్టింగ్‌లు వేశాడు. ఒకడుగు ముందుకు వేసి వైఎస్ జగన్ మళ్లీ సీఎం కాకపోతే తాను అరగుండు గీయించుకుంటానని శపథం చేశాడు. అంత విశ్వాసం ఉన్న శివకు ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశకు గురి చేశాయి.
Also Read: Virat Kohli: దీనికే కోహ్లీ అంటే అందరికి మండుద్ది.. విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్‌పై తీవ్ర దుమారం
జగన్ ఓడిపోవడంతో తాను వేసిన బెట్టింగ్ తీర్చేసుకున్నాడు. ఇక అతడి స్నేహితుల వద్ద కాచిన అరగుండును కూడా శివ తాజాగా చేయించుకున్నాడు. పందెం వేయడంతో ఇచ్చిన మాట ప్రకారం అరగుండు గీయించుకుని తిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతే తాను అరగుండు గీయించుకుంటానని కాచిన పందెం ప్రకారం చేసుకున్నట్లు తన స్నేహితులకు వీడియో కాల్ చేయడమే కాకుండా సెంటర్‌లో తిరిగాడు. జగన్ మాదిరి తాను కూడా ఇచ్చిన మాటను తప్పనని శివ ఓ వీడియోస సందేశంలో చెప్పాడు. మంచి చేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడే వ్యక్తి జగన్ అని.. అతడి మార్గంలోనే తాను కూడా ఇచ్చిన మాట ప్రకారం అరగుండు చేయించుకున్నట్లు వివరణ ఇచ్చాడు. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









