)
YSR Congress Party: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అన్యాయ పాలన చేస్తున్నారని.. రెడ్ బుక్ రాజ్యాంగంతో పార్టీ శ్రేణులను వేధింపులకు గురి చేస్తుండడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచేందుకు.. వారి రక్షణ కోసం డిజిటల్ బుక్ అనేది తీసుకువచ్చింది. దానికితోడు క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరింది. డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు చేస్తే పార్టీ అధిష్టానం కార్యకర్తలకు రక్షణగా నిలవనుంది. ఆ వివరాలు ఇలా..
ప్రతి వైసిపి కార్యకర్త అప్రమత్తంగా ఉండేందుకు తీసుకువచ్చిన డిజిటల్ బుక్, క్యూఆర్ కోడ్‌ను గుడివాడలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నాయకులు దుక్కిపాటి శశి భూషణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్యాయానికి గురైన పార్టీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకువచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకి, సామాన్య ప్రజలకు ఏ అన్యాయం జరిగినా ఈ డిజిటల్ బుక్‌లో నమోదు చేయవచ్చని తెలిపారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఎవరు అయితే నమోదు చేసుకున్నారో వారికి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తారని ప్రకటించారు.
డిజిటల్ బుక్ పని విధానం మొదటి విధానం
==> డిజిటల్ బుక్‌లో మొదట ఫిర్యాదు చేయాలి. వెబ్సైట్లోకి ఎంటరై ఫోన్ నంబర్ పొందుపరిస్తే ఓటీపీ వస్తుంది.
==> వచ్చిన ఓటీపీ అక్కడ పొందుపరిస్తే లొకేషన్, కెమెరా పర్మిషన్ అడుగుతుంది.
==> కెమెరా పర్మిషన్ ఇవ్వగానే మీకు జరిగిన అన్యాయాన్ని అడుగుతుంది
==> ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేందుకు అవకాశం ఉంది.
==> ఎంటర్ చేసిన డేటా ఆ డిజిటల్ బుక్ స్టోర్ అవుతుంది
డిజిటల్ బుక్ పని విధానం రెండో విధానం
==> డిజిటల్ బుక్‌లో రెండోది ఐవీఆర్ఎస్ విధానం. అన్యాయానికి గురైన వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఫోన్ నంబర్ 040-49171718 కాల్ చేసి డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు చేయొచ్చు.
==> ఫోన్ చేసిన వెంటనే బీప్ సౌండ్ వస్తుంది
==> ఫోన్ చేసిన వారు తమ నియోజకవర్గం.. ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నారో.. జరిగిన అన్యాయం ఏమిటో వివరాలు చెప్పాలి.
==> మొత్తం ఫోన్ కాల్లో డిజిటల్ బుక్ నిర్వాహకులు సమాచారం తీసుకుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook