Kodali nani suffers heart attack: మాజీ మంత్రి కొడాలినానికి హర్ట్ ఎటాక్ కు గురయ్యారు. వెంటనే ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొడాలినినిక వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు .
గుడివాడ నియోజక వర్గానికి చెందిన కొడాలినాని గతంలో మంత్రిగా పనిచేశాడు. వైసీపీలో కీలక నేతగా, జగన్ కు నమ్మినబంటుగా చెప్తుంటారు. కొడాలినాని తన దైన స్టైల్ లో అపోసిషన్ పార్టీలపై సెటైర్ లు వేస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం వైద్యులు కొడాలికి వైద్యం అందిస్తున్నారు. కోడాలినాని గ్యాస్ట్రిక్ సమస్యలతొ కూడా బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వైసీపీనేతలు కొడాలినాని ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. అసలు కొడాలినానికి హర్ట్ ఎటాక్ రాలేదని.. గ్యాస్ట్రిక్ సమస్యలను చెక్ చేసుకొవడానికి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లాలని.. అక్కడ వైద్యులు నిర్వహించిన టెస్టులలో.. గుండెపోటుకు సంబంధించిన సింప్టమ్స్ కన్పించడంతో వెంటనే వైద్యులు దానికి తగ్గ చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో వైద్యులు మరికాసేపట్లో.. కొడాలినాని హెల్త్ పై బులెటిన్ ను విడుదల చేస్తున్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.