YCP Mla Virupakshi Video: శ్రీరామ నవమి రోజు మహా అపచారం.. సీతమ్మ తల్లి మెడలో తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్..

Sri Rama navami celebrations: ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి  శ్రీరామ నవమి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఆయన సీతమ్మ మెడలో తాళి బొట్టుకట్టడం ప్రస్తుతం వివాదానికి కారణమైంది. దీనిపై హిందు సంఘాలన్ని మండిపడుతున్నాయి. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 8, 2025, 04:13 PM IST
  • సీతమ్మ మెడలో తాళికట్టిన వైసీపీ ఎమ్మెల్యే..
  • భగ్గుమన్న హిందు సంఘాలు..
YCP Mla Virupakshi Video: శ్రీరామ నవమి రోజు మహా అపచారం.. సీతమ్మ తల్లి మెడలో తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్..

YSRCP Mla virupakshi ties mangalsutra to goddess sita: ఇటీవల దేశ వ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో ప్రతి వీధిలోను, గుడుల్లోను కూడా భక్తులు శ్రీరామ నవమి ఉత్సవాలను, కళ్యాణంను ఘనంగా నిర్వహించారు. అయితే.. శ్రీరామ నవమి రోజు చాలా చోట్ల కళ్యాణం ను నిర్వహిస్తారు. పండితులు కళ్యాణంను జరిపిస్తారు.  దీనికి జంటలతో క్రతువు నిర్వహించేలా చేస్తారు. ఈ నేపథ్యంలో కర్నూల్ జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి చేసిన పని ప్రస్తుతం వివాదాం రాజేసింది.  

Add Zee News as a Preferred Source

ఎమ్మెల్యే స్వగ్రామం చిప్పగిరిలో జరిగిన సీతారామ కల్యాణం నిర్వహించారు .దీనిలో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి  పాల్గొన్నారు. అప్పుడు అక్కడున్న పండితులు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి దంపతులతో ప్రత్యేకంగా పూజలు చేయించారు. అంతే కాకుండా.. కళ్యాణం సమయంలో ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి సీతమ్మ మెడలో మంగళసూత్రం కట్టారు. ఇది ప్రస్తుతం కాంట్రవర్సీగా మారింది. సాధారణంగా పండితులు మూడు ముళ్లు ఉన్న మంగళసూత్రంను  పండితులు ముడులు వేసి కళ్యాణం జరిపించడం ఆనవాయితీ.

 

కానీ వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి  మాత్రం.. ఏకంగా అమ్మవారి మెడలో మూడు  ముళ్లను కట్టడం కాంట్రవర్సీగా కేరాఫ్ గా మారింది. ఈ ఘటనపై హిందు సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే విరూపాక్షి తాను పండితులు చెప్పిందే చేశానని క్లారిటీ ఇచ్చారు. సీతమ్మ మెడలో వేద పండితులు కట్టాల్సిన తాళిని విరూపాక్షి ఎలా కడతారంటూ పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విరూపాక్షి తాను చేసిన తప్పును తెలుసుకున్నారు.

Read more: Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. కొండపై ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అనుమతికి గ్రీన్ సిగ్నల్!?

ఈ ఘటనపై వెంటనే ఒక వీడియోను రిలీజ్ చేశారు.  తన వల్ల జరిగిన తప్పిదానికి సారీ చెప్తున్నట్లు చెప్పారు. తన మనస్సులో ఎలాంటి దురుద్దేశం లేదని కూడా స్పష్టం చేశారు. అయితే.. తనకు తాను కావాలని ఈ పని చేయలేదని, తన చేతికి మంగళసూత్రం ఇచ్చిన పండితులు చెబితేనే.. దానిని సీతమ్మ మెడలో వేశానంటూ ఆయన చెప్పుకొచ్చారు. మొత్తంగా ఎమ్మెల్యే విరూపాక్షి అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News