Mekapati Goutham Reddy: అవినీతిపరులకు ఆయనొక సింహ స్వప్నం.. గౌతమ్ రెడ్డి స్మృతులు
Mekapati Goutham Reddy: మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం రాజకీయ వర్గాలనే కాదు సామాన్యులను షాక్‌కి గురిచేసింది. ఎప్పుడూ ఫిట్‌గా కనిపించే గౌతమ్ రెడ్డి ఇలా హఠాన్మరణం చెందడం పట్ల సామాన్యులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Mekapati Goutham Reddy: ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం అధికార వైసీపీని దిగ్భ్రాంతికి గురిచేసింది. రాష్ట్రంలో కొత్త పెట్టుబడులకు గౌతమ్ రెడ్డి చేసిన కృషిని, ఆయన నిబద్దతతను ఆ పార్టీ గుర్తుచేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మంత్రిగా గౌతమ్ రెడ్డి ఎంత నిబద్దతతో ఉన్నారో చెబుతూ ఓ వీడియోను తాజాగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 'అవినీతి పరులకు ఆయనొక సింహ స్వప్నం' అని అందులో పేర్కొన్నారు.
గతంలో అసెంబ్లీ సమావేశాల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడిన వీడియో అది. అందులో గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. 'మీరు ఏ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వెతికినా ఐపీటీవీ ధర రూ.2వేలు ఉంటంది. అదే బాక్స్ ధర రూ.1450గా కూడా ఉంది. ఈ రెండు కలిపితే రూ.3450 వరకు వస్తుంది. ఈ రెండు టెక్నాలజీలతో కూడిన బాక్స్‌ను రూ.4400కి కొనుగోలు చేశారు. ఇలాంటి అవినీతి ఉందనే సీఎం గారు దీనిపై కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఉదాహరణకు.. ఈ రూ.1000నే తీసుకుంటే.. రూ.1000 కోట్లు ఆదా చేయొచ్చు. ఇంకా మేము 90 లక్షల సీపీయూ కొనుగోళ్లు చేయాల్సి ఉంది. అంటే ఇందులో డైరెక్ట్‌గా రూ.1000 కోట్లు సేవింగ్స్ కనబడుతోంది. ముఖ్యమంత్రి గారు కోరుకున్న దాని కన్నా ఎక్కువే మిగల్చడానికి ప్రయత్నిస్తాం.' అని గౌతమ్ రెడ్డి అందులో పేర్కొన్నారు.
కాగా, మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం (ఫిబ్రవరి 21) ఉదయం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ ఫిట్‌గా, కండలు తిరిగిన దేహంతో కనిపించే గౌతమ్ రెడ్డి.. ఇలా హఠాన్మరణం చెందడం చాలామందిని షాక్‌కి గురిచేసింది. గౌతమ్ రెడ్డి ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు. అయితే పోస్ట్ కోవిడ్ కారణాలే ఆయన మరణానికి దారితీసి ఉండొచ్చునని అనుమానిస్తున్నారు.
మంగళవారం (ఫిబ్రవరి 22) ఉదయం 8.30గంటలకు హైదరాబాద్ నుంచి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని నెల్లూరుకు తరలించనున్నారు. అక్కడ కార్యకర్తల సందర్శనార్థం స్వగృహంలో గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని ఉంచుతారు. ఎల్లుండి మధ్యాహ్నం ఒంటిగంటకు బ్రాహ్మణపల్లెలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి.
Also Read: Man Flirting: ఒకేసారి 85 మంది అమ్మాయిలతో సరసాలు.. చివరికి ఇలా దొరికిపోయాడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook