YSRCP Formation: ఎల్లప్పుడూ ప్రజల వెంటే.. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే..!

YSRCP Formation Day:: ఎల్లప్పుడూ ప్రజల వెంటే.. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే అంటూ తేల్చి చెప్పారు వై.యస్. జగన్మోహన్ రెడ్డి.  వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి రావడం పక్కా అని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూనే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 12, 2025, 01:08 PM IST
YSRCP Formation: ఎల్లప్పుడూ ప్రజల వెంటే.. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే..!

YSRCP Formation Day:  ప్రతిపక్షంలో కూర్చోవడం కొత్తేమి కాదని,  మరో నాలుగేళ్లు గడిస్తే.. అధికారంలోకి వచ్చేది తామేనన్న ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్‌ ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. వైసీపీ అవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ జెండాను జగన్‌ ఆవిష్కరించారు.

Add Zee News as a Preferred Source

ఈ సందర్భంగా  అన్ని కలెక్టరేట్ల వద్ద ఫీజు రీయింబర్స్‌మెంట్ , వసతి దీవెన బకాయిలు, నిరుగ్యోగ భృతి హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి.. వైయస్ఆర్సీపీని (యువ జన శ్రామిక రైతు పార్టీ) 12 మార్చి 2010న స్థాపించారు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

నేటితో 15 యేళ్లు పూర్తి చేసుకుంది. దాదాపు పదిహేనేళ్ల ప్రస్థానంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ పార్టీ తరుపున ఒకసారి ఎంపీగా.. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అందులో ఒకసారి ప్రతిపక్ష నేతగా.. మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సారి వైయస్ఆర్సీపీకి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ప్రతిపక్ష స్థానం దక్కలేదు. దీంతో ప్రతిపక్ష స్థానం ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పి.. శాసనసభను బాయ్ కాట్ చేశారు.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News