Bank Holiday: బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలెర్ట్.. వచ్చేవారం ఈ 3 రోజులు వరుసగా బ్యాంకులు బంద్..!

3 Days Continuous Bank Holidays: మార్చి నెలలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు భారీగానే సెలవులు వచ్చాయి. ముఖ్యంగా హోలీ, ఉగాది, రంజాన్ ఇదే నెలలో రానున్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా సెలవులు వస్తున్నాయి. అయితే ఈ నెలలో స్కూళ్లకు మాత్రమే కాదు, బ్యాంకులు కూడా వరుసగా మూడు రోజులు బంద్‌.మార్చి 14, 15, 16 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు.. ఎందుకో తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Mar 5, 2025, 05:27 PM IST
Bank Holiday: బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలెర్ట్.. వచ్చేవారం ఈ 3 రోజులు వరుసగా బ్యాంకులు బంద్..!

3 Days Continuous Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెలలో వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు. మార్చి 14, 15, 16వ తేదీల్లో బ్యాంకులు పని ఎందుకంటే మార్చి 14 హోలీ పండుగ, 15 శనివారం ఈ ఒక్కరోజూ మినహాయిస్తే 16 ఆదివారం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. కొన్ని ప్రాంతాల్లో హోలిక దహనం 13 ఆరోజు కూడా సెలవు ఉంది. బ్యాంకులకు ఆర్‌బీఐ క్యాలెండర్ ప్రకారం సెలవులు మంజూరు చేస్తారు. ఇవి కాకుండా కొన్ని స్థానిక పండుగలు ప్రత్యేక సందర్భాల్లో కూడా బ్యాంకులు పనిచేయవు. ప్రతి ఆదివారంలో కూడా బ్యాంకులు పనిచేయవు. అయితే మార్చి నెలలో 9, 16, 23, 30 తేదీల్లో ఆదివారాలు రానున్నాయి. కాబట్టి ఈరోజుల్లో బ్యాంకులు పనిచేయవు.

Add Zee News as a Preferred Source

ఇవి కాకుండా రెండో, నాలుగో శనివారం అయిన 8, 22వ తేదీ కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి. ముఖ్యంగా మార్చి 19వ తేదీ రంగ పంచమి సందర్భంగా ఉజ్జయిని జిల్లాలో ఆరోజు కూడా బంద్ ఉండనున్నాయి. ఈ రోజుల్లో స్కూళ్లు కూడా సెలవులు రావడంతో బ్యాంకు విద్యార్థులకు భారీ ఊరట లభిస్తుంది. కొన్ని పండుగలు ప్రత్యేక దినాలు సందర్భంగా ఈ భారీ సెలవులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు, స్కూళ్లు, కాలేజీలు మాత్రమే కాదు కొన్ని ప్రభుత్వ రంగ కార్యాలయాలకు కూడా సెలవు రానుంది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో వారు ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్లి ఎంజాయ్ చేసే అవకాశం కూడా ఉంటుంది.

రాష్ట్రప్రభుత్వం మహిళలకు శుభవార్త.. రూ.2500 కావాలంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి..!

హోలీ సందర్భంగా మార్చి 14వ తేదీ బ్యాంకులు పనిచేయవు. ఇక శనివారం మార్చి 15న మినహాయిస్తే ఆ మరుసటి రోజు 16 ఆదివారం బ్యాంకులకు సెలవు రానుంది. శనివారం కూడా సెలవు తీసుకుంటే  వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవు వస్తుంది. ఈ నేపథ్యంలో ముందుగానే మీకు ఏమైనా బ్యాంకు పనులు ఉంటే చూసుకోవాలి. లేకపోతే ఇబ్బంది పడాల్సిన వస్తుంది. భారీ ఎత్తున డిపాజిట్లు ఉంటే బ్యాంకులు వెళ్లక తప్పదు. ఇది కాకుండా విత్‌ డ్రా చేయాల్సిన సొమ్ము ఉంటే కూడా బ్యాంకులకు వెళ్లక తప్పదు. ముందుగానే తెలుసుకుని బ్యాంకు పనులు ముగించుకోవాలి.

మార్చి 31 సోమవారం ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ఆ రోజుకు ఆ రోజు కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి. కానీ ఆన్లైన్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఏటీఎం, నెట్ బ్యాంకింగ్ వంటివి పనిచేస్తాయి. అయితే మార్చి 19 'రంగ పంచమి' కారణంగా ఉజ్జయిని, గటియా, నాకూదా, బాద్నగర్ తహసిల్దారు.ఈ  ప్రాంతాల్లో సెలవు ప్రకటించనుంది. ఉజ్జయిని కలెక్టర్ నీరజ్ సింగ్ ఈ మేరకు  ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ఇక ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కూడా ఈ రోజు సెలవు రానుంది. ఇది కాకుండా స్కూళ్లు, కాలేజీలు కూడా బంద్ ఉంటాయి.

ఇదీ చదవండి:  షాంపూ, నూనెలు కాదు.. ఇలా మసాజ్‌ చేసినా జుట్టు మోకాళ్ల వరకు పెరగడాన్ని ఎవ్వరూ ఆపలేరు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News