)
Dormant Bank Account: మనం చాలాసార్లు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో బ్యాంకులో అకౌంట్లను ఓపెన్ చేస్తూ ఉంటాము. అయితే బ్యాంకులో అకౌంట్ లో ఓపెన్ చేసి వాటిని ఆపరేట్ చేయడం వదిలేస్తుంటాము. కొన్ని సందర్భాల్లో వాటిలో మినిమం బాలన్స్ కూడా ఉంచకుండా తీసేసి అలాగే వదిలేస్తుంటాము. ఇలా చేయడం వల్ల మీరు నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అవును మీరు వింటున్నది నిజమే బ్యాంక్ అకౌంట్ లో ఆపరేటివ్‌గా లేకపోయినట్లయితే వెంటనే వాటిని బ్యాంకు వారిని సంప్రదించి మూసివేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే ఇది మీ ఫైనాన్షియల్ హెల్త్ కు అంత మంచిది కాదని సూచన చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్లను నిష్క్రియంగా ఉంచి బ్యాలెన్స్ లేకుండా ఉంచడం వల్ల కలిగే నష్టాలు ఏంటో చూద్దాం.
బ్యాంకు చార్జీలు నష్టపరుస్తాయి:
బ్యాంకుల్లో మీ పాత ఖాతాల్లో మినిమం బాలన్స్ ఉండకుండా అలాగే ఉంచినట్లయితే బ్యాంకులో చార్జీలు కట్ చేస్తాయి. ఖాతాలో డబ్బు లేకపోతే నెగటివ్ బ్యాలెన్స్ అవుతుంది కొత్త కాదా తెరవాలని కూడా ఇది సమస్యలు తెచ్చే అవకాశం ఉంది.
డబ్బు వృథా అవుతుంది:
ఎక్కువగా బ్యాంకు ఖాతాలు ఉన్నట్లయితే అన్నింట్లోనూ మీరు మినిమం బాలన్స్ ఉంచాల్సి ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్ లో డబ్బులు అలాగే ఉంచడం వల్ల మీరు వడ్డీ ఆదాయం కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ డబ్బులు మీరు ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టినట్లయితే అంతకన్నా ఎక్కువ వడ్డీ అదేం లభిస్తుంది. లేదా ఇతర ఇతర ఇన్వెస్ట్మెంట్ పద్ధతుల్లో కూడా మీరు ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు ఎక్కువ డబ్బును సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కనుక ఎక్కువ అకౌంట్లను మెయింటైన్ చేయకుండా ఉంటే మంచిది.
మోసాలకు అవకాశం:
. ఉపయోగించేది బ్యాంకు ఖాతాలు సైబర్ చోరగాళ్లు తమ అక్రమ లావాదేవీల కోసం వాడుకునే అవకాశం ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మీరు ఎప్పటికప్పుడు బ్యాంక్ అకౌంట్ ను చెక్ చేసుకుంటూ ఉండాలి. వాటిలో ఏమేం ట్రాన్సాక్షన్లు జరిగాయి. వెంట వెంటనే తెలుసుకునే ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది.
క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది:
బ్యాంకు ఎకౌంటు డబ్బులు లేనప్పుడు మీ ఎకౌంటు నెగిటివ్ బ్యాలెన్స్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు బ్యాంకుకు అప్పు ఉన్నట్టు అర్థం. దీన్ని బట్టి మీ క్రెడిట్ స్కోర్ సైతం దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. కనుక మీకు క్రెడిట్ స్కోర్ దెబ్బ తినకుండా ఉండాలంటే మీ బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe