7th Pay Commission: ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్. త్వరలో 7వ వేతనసంఘం సిఫార్సుల ప్రకారం జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రభుత్వ ఎయిడెడ్ టీచర్లకు 7వ వేతన సంఘం ప్రకారం జీతాలు చెల్లించాలనేది దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్య, ఈ సమస్యను త్వరలో పరిష్కరించనున్నట్టు పుదుచ్చేరి హోం, విద్యాశాఖ మంత్రి ఏ నమశివాయ తెలిపారు. అంట త్వరలో ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు జీతాలు భారీగా పెరగనున్నాయి.
7వ వేతనసంఘం సిఫార్సుల మేరకు జీతాలు చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి తగిన ఆదేశాలు జారీ చేశామని మంత్రి నమ శివాయ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగసంఘాలు మంత్రి నమశివాయను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం కావడంతో ఇక్కడి ఉద్యోగుల జీతాలు, అలవెన్సులను కేంద్ర ప్రభుత్వం చెల్లించినట్టే చెల్లిస్తుంటారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
మరోవైపు కేంద్ర కేబినెట్ డీఏ పెంపుపై ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు. జీతం పెంపుపై ప్రకటన వెలువడగానే..కేంద్ర ప్రభుత్వం కోటికి పైగా ఉన్న ఉద్యోగులు,పెన్షనర్లకు 4 శాతం చొప్పున డీఏ పెంచనుంది. ప్రస్తుతం డీఏ 38 శాతం వస్తోంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు. కేంద్ర కార్మిక శాఖ ప్రతి నెలా విడుదల చేసే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా ప్రభుత్వం డీఏ పెంపు ఎంత ఉండాలనేది నిర్ణయిస్తుంటుంది. తాజా గణాంకాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో 6.44 శాతానికి పడిపోయింది. ఇంధన ధరలు, నిత్యావసర ధరలు స్వల్పంగా పెరగడంతో ఈ పరిస్థితి ఎదురైంది.
Also read: Top SUVs Under 10 Lakhs: 10 లక్షల లోపు టాప్ ఎస్‌యూవీలు.. పంచ్, నెక్సాన్, బ్రెజ్జాతో సహా థార్ కూడా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook