)
8th CPC Salary Calculator: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరిలో 8వ పే కమిషన్ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా లెవల్-8లో ఉన్న సీనియర్ అధికారులు దీని వల్ల ఎలాంటి లాభం పొందుతారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘం ప్రధాన బలం ఫిట్మెంట్ ఫ్యాక్టర్. దీని ఆధారంగా ఉద్యోగుల జీతాలు లెక్కిస్తారు. 7వ వేతన సంఘంలో 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉండగా, 8వ వేతన సంఘం కోసం 1.92 రెట్లు పెరుగుదల అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం వల్ల లెవల్-8లో ఉన్న సీనియర్ అధికారుల జీతాలు గణనీయంగా పెరగనున్నాయి.
ప్రస్తుత జీతం vs కొత్త జీతం:
ఉదాహరణకు 35 సంవత్సరాలుగా ప్రభుత్వ సేవ చేస్తున్న శరత్ అనే సీనియర్ అధికారి గురించి తెలుసుకుంటే... ఆయన ప్రస్తుత ప్రాథమిక జీతం రూ. 1,51,100గా ఉంది. 8వ వేతన సంఘం అమలులోకి వచ్చినట్లయితే అదే ప్రాథమిక వేతనం రూ. 2,90,112కి పెరగనుంది.
ప్రస్తుతం ఆయనకు DA, HRA, TA కలిపి సుమారు రూ. 2.85 లక్షల స్థూల జీతం పొందుతున్నారు. 8వ వేతన సంఘం అమలు తర్వాత ఇది రూ. 3.63 లక్షల వరకు పెరగవచ్చని అంచనా వేయవచ్చు. అంటే నెలకు దాదాపు రూ. 78,000 అదనంగా జీతం పెరుగుతుంది. ఇది కేవలం లెవల్-8 ఉద్యోగికి మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇతర స్థాయిలలో ఉన్నవారికి కూడా తగినంత పెరుగుదల ఉంటుంది.
జీతం పెరగడం వలన కొన్ని తగ్గింపులు కూడా పెరుగుతాయి. ఉదాహరణకు ఓ విషయాన్ని గమనించినట్లయితే.. ప్రస్తుతానికి ఎన్పీఎస్ సహకారం సుమారు రూ. 23,421 ఉంటే.. పెరిగిన జీతంతో అది రూ. 29,011 వరకు పెరుగుతుంది. అదే విధంగా ఆదాయపు పన్ను కూడా కొత్త విధానం ప్రకారం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి శరత్ సుమారు రూ. 50,606 పన్ను చెల్లిస్తుంటే.. 8వ వేతన సంఘం అమలు తర్వాత ఇది రూ. 75,012 వరకు పెరగనుంది.
అన్ని తగ్గింపులు పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రస్తుతానికి శరత్ చేతికి వచ్చే జీతం రూ. 2,10,438 వస్తుంది. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే, ఆయన నికర జీతం రూ. 2,58,666గా ఉండే అవకాశం ఉంది. అంటే నెలకు దాదాపు రూ. 48,000 అదనంగా అందుతుందని మనం గమనించవచ్చు.
8వ వేతన సంఘం అమలులోకి రాగానే, సీనియర్ అధికారులకు ఇది ఒక పెద్ద బూస్ట్ అవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా లెవల్-8లో ఉన్న అధికారులు, పదవీ విరమణకు దగ్గరగా ఉన్నవారు దీని వల్ల మరింత లాభం పొందుతారు. ప్రభుత్వం తుది సిఫార్సులు చేసిన తర్వాత HRA, TA, పన్ను రేట్లలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఇప్పటి అంచనాల ప్రకారం, ఉద్యోగుల జీతంలో గణనీయమైన పెరుగుదల తప్పకుంటుందని చెప్పుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.