)
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన 8వ పే కమిషన్ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ కమిషన్ కార్యాచరణకు కీలకమైన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR)ను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌ను కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించగా, ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్–టైమ్ సభ్యుడిగా, పంకజ్ జైన్ మెంబర్–సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు.
వేతన సవరణలు, పెన్షన్ మార్పులు, భవిష్యత్తు జీత నిర్మాణం వంటి అంశాలపై వచ్చే 18 నెలల పాటు ఈ కమిషన్ సమగ్ర అధ్యయనం జరుపనుంది. అనంతరం ప్రభుత్వానికి తన సూచనలు సమర్పిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులు, పెన్షనర్లంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌పై పరిశీలన అత్యంత కీలకమైన అంశంగా నిలుస్తోంది.
గతంలో 7వ పే కమిషన్ 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను సిఫారసు చేయడంతో కనీస బేసిక్ వేతనం 7,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు పెరిగింది. ఇదే నేపథ్యంలో 8వ పే కమిషన్ కూడా సమానమైన లేదా ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను సూచించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు 2.82 వరకు పెంచాలని బలంగా కోరుతున్నాయి. అయితే కమిషన్ 2.52 రేటు చుట్టూ సిఫారసు చేసినట్లయితే, 18,000 బేసిక్ వేతనం నేరుగా 18,000 x 2.52 = 46,260 రూపాయలకు పెరిగే అవకాశం ఉంది.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరుగుదలతో పాటు ఇతర అలవెన్సుల సమీక్ష కూడా జరగనుండటంతో ఉద్యోగుల ఆశలు మరింత పెరుగుతున్నాయి. మరోవైపు 7వ పే కమిషన్ కాలపరిమితి 2025 డిసెంబర్‌తో ముగియనుండగా, 2026 జనవరి 1 నుంచి 8వ పే కమిషన్ సిఫార్సులు అమలులోకి రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సిఫార్సులు ప్రకటించేందుకు పడే సమయాన్ని బట్టి ఉద్యోగులకు 18 నెలల వరకు ఎరియర్స్ లభించే అవకాశముందని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద, కొత్త పే కమిషన్ నిర్ణయాలు కేంద్ర ఉద్యోగుల్లో భారీ ఆసక్తి, కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.