Adobe Warns employees: ఉద్యోగులకు అడోబ్ హెచ్చరిక- కరోనా టీకా తీసుకోకుంటే జీతం కట్​!

Adobe on Vaccine: అమెరికా టెక్ కంపెనీ అడోబ్​ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు వీలైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని సూచించింది. లేదంటే వేతనంలేని సెలవులు, పని చేసిన వేతనం చెల్లించకపోవడం వంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 23, 2021, 06:36 PM IST
Adobe Warns employees: ఉద్యోగులకు అడోబ్ హెచ్చరిక- కరోనా టీకా తీసుకోకుంటే జీతం కట్​!

Adobe Warns employees: అమెరికాకు చెందిన మల్టీ నేషనల్​ కంప్యూటర్ సాఫ్ట్​వేర్ కంపెనీ అడోబ్​ ఉద్యోగులకు కీలక సూచనలు చేసింది. అమెరికా వ్యాప్తంగా ఉన్న కంపెనీ ఉద్యోగులు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేసుకోవాలని (Adobe on Corona vaccine) స్పష్టం చేసింది. ఉద్యోగులంతా కరోనా టీకా వేసుకునేందుకు డిసెంబర్ 8ని తుది గడువుగా నిర్ణయించింది.

స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. దేశంలోని ఉద్యోగలందు టీకా వేసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేసిన నేపథ్యంలో.. అడోబ్​ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయం వెనుక కారణాలు..

దాదాపు రెండేళ్లుగా ప్రపంచదేశాలను కరోనా వణికిస్తూనే ఉంది. శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి వ్యాక్సిన్​ను అందుబాటులోకి తెచ్చినా.. చాలా మంది టీకా తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. వారిలో బడా కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులంతా టీకా వేసుకోవడం తప్పనిసరి చేస్తున్నాయి కంపెనీలు. ఒకవేళ ఎవరైనా ఉద్యోగులు టీకా తీసుకోకుంటే పని చేసినా, లీవ్​లో ఉన్నా(Unpaid leaves to Adobe employees) వేతనం చెల్లించబోమని తెల్చి చెప్పింది.

Also read: Vladimir Putin: అయ్యయ్యో వద్దమ్మా...ఆఫీసుకు రావొద్దు..కానీ జీతాలిస్తాం..సుఖీభవ!

Also read: Joe Biden : చైనా దాడులు చేస్తే తైవాన్‌ను మేము రక్షిస్తాం ‌- జో బైడెన్‌

వారికి మాత్రం మినహాయింపు..

మతపరమైన నమ్మకాలతో టీకా వేసుకోలేనివారికి.. అనారోగ్యం కారణంగా వైద్యుల సూచన మేరకు వ్యాక్సిన్​ తీసుకోలేని వారికి మాత్రం నిబంధనల నుంచి మిహహాయింపు ఇస్తున్నట్లు అడోబ్​ వెల్లడించింది.

అయితే ఉద్యోగులకు.. ఇలాంటి నిబంధనల పెట్టిన కంపెనీ అడోబ్ మాత్రమే కాదు. టెక్ దిగ్గజం ఐబీఎం కూడా ఇదివరకే ఇలాంటి నిబంధనల తీసుకొచ్చింది. ఈ కంపెనీ కూడా డిసెంబర్ 8నే గడువుగా పెట్టింది. త్వరలోనే మరిన్న కంపెనీలు కూడా ఐబీఎం, అడోబ్ బాటను అనుసరించే వీలుంది. చాలా ఇలాంటి నిబంధనలు విధించనప్పటికీ.. టీకా వేసుకునేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నాయి. మరికొన్న కంపెనీలు ఫార్మా కంపెనీలతో ఒప్పందం ద్వారా ఉద్యోగులకు టీకాలు వేయిస్తున్నాయి.
ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే ఈ నిబంధనను పెట్టినా..త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఈ నిబంధనను తీసుకువచ్చే అవకాశముందని తెలుస్తోంది.

Also read: Salmonella outbreak: అగ్రరాజ్యాన్ని వణికిస్తోన్న ఉల్లిపాయ.. సాల్మొనెల్లా వ్యాధి వ్యాప్తి

Also read: Mobile phone removed from stomach: కడుపులో మొబైల్ ఫోన్.. సెల్ ఫోన్ మింగిన తర్వాత 6 నెలలకు సర్జరీ

ప్రపంచంపై కరోనా పిడుగు..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 24.3 కోట్ల మందికి కరోనా సోకింది. వారిలో దాదాపు 50 లక్షల మంది కొవిడ్ కారణంగా మృతి చెందారు. ఒక్క అమెరికాలో 4.6 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో ఇప్పటి వరకు మొత్తం 7.5 లక్షలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో అత్యధిక కొవిడ్ కేసులు నమోదైన దేశం కూడా అమెరికానే కావడం గమనార్హం. అమెరికా తర్వాత ఇండియా, బ్రెజిల్​, యూకే, రష్యా, టర్కీ, ఫ్రాన్స్​, ఇరాన్​ దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Also read: Stalin boards bus: ఆర్టీసీ బస్సెక్కిన తమిళనాడు సీఎం- ఆశ్చర్యపోయిన ప్రయాణికులు

Also read: Samantha Char Dham Yatra : ప్రత్యేక హెలికాప్టర్‌లో సమంత తీర్థయాత్ర

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News