Ahmedabad Plane Crash: 2025 జూన్ 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదంలో 270 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కొన్ని కుటుంబాల్లో ఒకరు కూడా మిగలకుండా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్ దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ఘటనగా మిగిలింది. ఎంతో మంది కలలు కల్లోలుగా మిగిలాయి. విమాణ ప్రయాణికులతోపాటు మెడికల్ కాలేజీ విద్యార్థులు సైతం ప్రాణాలు కోల్పోయాయి. ఈ అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారి గురించి బీమా రంగంలో అనేక కొత్త సవాళ్లు తలెత్తాయి. ఈ ప్రమాదంలో పాలసీదారుడు, అతని నామినీ ఇద్దరూ మరణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీని కారణంగా బీమా కంపెనీలు క్లెయిమ్‌లను పరిష్కరించడంలో గందరగోళాన్ని ఎదుర్కొంటున్నాయి.
ఈ ప్రమాదం తర్వాత, ప్రధాన బీమా కంపెనీలు LIC, HDFC లైఫ్, టాటా AIG, ఇఫ్కో టోకియో, బజాజ్ అలియాంజ్‌లు బీమా పాలసీ ఉన్నప్పటికీ, నామినీ కూడా ప్రమాదంలో మరణించిన అనేక కేసులను అందుకున్నాయి. దీనివల్ల ఎవరికి పరిహారం ఇవ్వాలో నిర్ణయించడం కష్టంగా మారింది. బీమా కంపెనీల ప్రకారం, సాధారణంగా పాలసీదారుడు మరణించి, నామినీ జీవించి ఉంటే, ప్రక్రియ సులభం. కానీ, ఇద్దరూ లేనప్పుడు, వారసత్వ ధృవీకరణ పత్రం అవసరం. ఇది ప్రక్రియను సుదీర్ఘంగా, సంక్లిష్టంగా చేస్తుంది. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలో తోచక బీమా కంపెనీలు సందిగ్ధంలో ఉన్నట్లు అనిపిస్తుంది.
బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) బీమా కంపెనీలకు మృతుల జాబితాను వారి డేటాతో సరిపోల్చాలని, వీలైనంత త్వరగా క్లెయిమ్‌లను పరిష్కరించాలని సూచించింది. అలాగే, సాంకేతిక లాంఛనాల కారణంగా ఎటువంటి క్లెయిమ్‌ను నిలిపివేయకూడదు లేదా ఆలస్యం చేయకూడదని ఆదేశించింది. దీని తరువాత, బీమా కంపెనీలు అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌లో సహాయ కేంద్రాలను ప్రారంభించాయి.
పాలసీదారుడు, నామినీ జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించిన కేసు నమోదైందని LIC అధికారి ఆశిష్ శుక్లా తెలిపారు. అలాంటి సందర్భాలలో, ఇప్పుడు కేటగిరీ-1 వారసులను (పిల్లలు లేదా రక్త బంధువులు) వెతుకుతున్నారు. చాలా మంది పిల్లలు ఉంటే, క్లెయిమ్‌ను పరిష్కరించుకోవడానికి అందరి నుండి ఉమ్మడి ప్రకటన, నష్టపరిహార బాండ్‌ను తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియను సాధారణ పరిస్థితులకు భిన్నంగా, ప్రత్యేక సౌలభ్యంతో అవలంబిస్తున్నారు.
టాటా AIG అధికారి నిశ్చల్ బుచ్ మాట్లాడుతూ, తమ కంపెనీకి ఇలాంటి ఏడు క్లెయిమ్‌లు వచ్చాయని, వాటిలో ఒకదానిలో పాలసీదారుడు, నామినీ ఇద్దరూ మరణించారని చెప్పారు. ఈ సందర్భాలలో, వారసుల నుండి ఉమ్మడి ప్రకటన తీసుకోవడం ద్వారా క్లెయిమ్‌ను పరిష్కరించవచ్చా అని కంపెనీ లీగల్ బృందం పరిశీలిస్తోంది. IFFCO టోకియో క్లెయిమ్ మేనేజర్ మన్‌ప్రీత్ సభర్వాల్ మాట్లాడుతూ, తన కంపెనీ బీమా చేసిన కంపెనీ డైరెక్టర్ అతని భార్య ఇద్దరూ విమాన ప్రమాదంలో మరణించారని, ఇది క్లెయిమ్ ప్రక్రియను మరింత క్లిష్టతరం చేసిందని అన్నారు.
Also Read: ICC: అసలు కెప్టెన్ ఎవరు? జై షా నా? బావుమా నా? ఇంత బిల్డప్ ఎందుకు బాబాయ్..!!
ఈ ప్రమాదం, బీమా రంగం అటువంటి అత్యవసర పరిస్థితులకు అనువైన, మానవ-కేంద్రీకృత విధానాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కాగితపు ప్రక్రియలపై మాత్రమే ఆధారపడటం వల్ల క్లెయిమ్‌దారులకు సమస్యలు తలెత్తడమే కాకుండా బీమా కంపెనీల ఇమేజ్ కూడా దెబ్బతింటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.









