Airtel vs Vodafone Idea: ఎక్కడా లేనివిధంగా భారత్‌లో టెలికాం సంస్థల మధ్య పోటీ నెలకొంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకరకాల ప్లాన్‌లను తీసుకొస్తున్నారు. దేశంలో జియో రాకతో టెలికాం సంస్థల పోరు తీవ్రతరం అయ్యింది. నువ్వానేనా అన్నట్లు సంస్థలన్నీ పోటీ పడుతున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్‌(Airtel ), వొడా ఫోన్ ఐడియా(Vodafone Idea) న్యూ ప్లాన్‌ను తీసుకొచ్చాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇరు సంస్థలూ రూ.839 ప్లాన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చాయి. ఈప్లాన్ వల్లే కల్గే ప్రయోజనాలు ఒకేలా ఉన్నాయి. ఎయిర్ టెల్ సంస్థ రూ.839 ప్రీపెయిడ్ ప్లాన్‌ను 84 రోజులపాటు ఉపయోగించుకోవచ్చు. రోజూ 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజూ వంద ఎస్‌ఎంఎస్‌లు(SMS) వస్తాయి. మొత్తం 84 రోజులపాటు 168 జీబీ డేటాను వినియోగదారులు వాడుకోవచ్చు. వీటితో పాటు మరిన్ని అదనపు ప్రయోజనాలను కల్పించారు.  


మూడు నెలలకు డిస్నీ,హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ ఉంటుంది. ఎక్స్‌టీం మొబైల్ ప్యాక్, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌ను నెలపాటు ఉపయోగించుకోవచ్చని ఎయిర్‌టెల్‌ తెలిపింది. అపోలో, ఫాస్టాగ్‌పై వంద రూపాయల క్యాష్‌ బ్యాక్‌ పొందే ఉంది. ఉచిత వింక్‌ మ్యూజిక్‌ కూడా ఉంటుంది. 2 జీబీ డేటా వినియోగం పూర్తైన తర్వాత నెట్‌ను వాడుకునే అకాశం కల్పించారు. 


ఇటు వొడాఫోన్‌ ఐడియా సైతం ఎయిర్‌టెల్‌లాగే కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.839 ప్లాన్‌లో 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజూ వంద ఎస్‌ఎంఎస్‌లను వినియోగించుకోవచ్చు. మొత్తం 168 జీబీ డేటా వస్తుంది. ఎయిర్‌టెల్‌కు భిన్నంగా అర్ధరాత్రి 12 తర్వాత ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను వినియోగించుకునే అవకాశం కల్పించారు. వీటితోపాటు అదనపు ప్రయోగనాలను సైతం తీసుకొచ్చారు. మొత్తంగా రెండు ప్లాన్లు ఒకేలా ఉన్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సదురు సంస్థలు తెలిపాయి. మరి కస్టమర్లు ఏ ప్లాన్‌పై ఆసక్తి చూపుతారో చూడాలి.


Also read:Hair found in Food: ఆహారంలో జుట్టు రావడం రాహువుకు సంకేతం..ఇలా తరుచుగా జరిగే ఆ నష్టాలు తప్పవు..!!


Also read:Monkeypox Symptoms: మంకీపాక్స్ ప్రాణాంతకమా? దాని లక్షణాలు ఏంటి? మంకీపాక్స్ కు వ్యాక్సిన్ ఉందా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook