Anant Ambani: కొత్త జీవితంలోకి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌

Anant Ambani Starts New Life In His Life: రిలయన్స్‌ సంస్థలో భారీ పరిణామం చోటుచేసుకుంది. ముకేశ్‌ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీకి కీలక బాధ్యతలు అప్పగించారు. అతడికి పూర్తిస్థాయి ప్రమోషన్‌ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 26, 2025, 08:20 PM IST
Anant Ambani: కొత్త జీవితంలోకి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌

Reliance Industries: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన వ్యాపార వారసుడు అనంత్‌ అంబానీకి పదోన్నతి లభించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) అధినేత ముకేశ్‌ అంబానీ తన చిన్నకుమారుడికి ప్రమోషన్‌ ఇచ్చాడు. ఇన్నాళ్లు తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తున్న అనంత్‌ అంబానీకి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. అతడి నియామకానికి సంబంధించి రిలయన్స్‌ సంస్థల ప్రతినిధులు అంగీకారం తెలిపారు.

Add Zee News as a Preferred Source

Also Read: Cars24 Lays Off: ఐపీఎల్‌లో, సొంత కంపెనీలో ధోనీకి కష్టాలు.. ఒక్కసారిగా 200 ఉద్యోగులను తొలగింపు

రిలయన్స్‌ సంస్థ బోర్డులో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా అనంత్‌ అంబానీ పని చేశారు. అనంత్‌ అంబానీ మానవ వనరులు, నామినేషన్‌, వేతన కమిటీ సిఫార్సు ఆధారంగా బోర్డు ఈ నియామకానికి ఆమోదం తెలిపింది. వాటాదారుల ఆమోదానికి లోబడి 2025 మే 1వ తేదీ నుంచి ఐదేళ్ల పాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని కంపెనీ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ఫైలింగ్‌లో తెలిపింది. ఇప్పుడు భారతదేశంలోని అత్యంత విలువైన కంపెనీలో డైరెక్టర్‌గా ఉండనున్నారు. గతంలో అనంత్‌ అంబానీ రిలయన్స్‌ గ్రూపు కంపెనీలలో కీలక బాధ్యతలు చేపట్టారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అనంత్‌ వేతనం ఏడాదికి రూ.4.2 కోట్లు ఉంది. అయితే ఇప్పుడు ఫుల్‌ టైమ్‌ డైరెక్టర్‌ నియామకమవడంతో ఆ వేతనం మరింత భారీగా పెరగనుంది.

Also Read: Pahalgam Terror Attack: భారత్ - పాక్ ఉద్రిక్తతతో.. మనదేశంలో కూడా వీటి ధరలు భారీగా పెరిగే ఛాన్స్.. లిస్ట్ ఇదే

ముకేశ్‌ అంబానీకి ఇద్దరు కుమారులు ఆకాశ్‌ అంబానీ, అనంత్‌ అంబానీ. చిన్న కుమారుడు అయిన అనంత్‌ అంబానీ వ్యాపారంలో చిన్న స్థాయి నుంచి అడుగులు వేస్తూ నేడు రిలయన్స్‌ సంస్థలో అత్యున్నత పదవి చేపట్టారు. అనంత్‌ అంబానీ ఉన్నత విద్య అభ్యసించాడు. అమెరికాలోని బ్రౌన్‌ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ పొందాడు. ముకేశ్‌ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీ గ్రూప్‌ టెలికాం అండ్‌ డిజిటల్‌ సేవల విభాగం రిలయన్స్‌ జియో ఇన్‌ఫోకామ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇషా అంబానీ రిటైల్‌ విభాగం రిలయన్స్‌ రిటల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. ఆకాశ్‌, ఇషా అంబానీలు రిలయన్స్‌ బోర్డులో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా బాధ్యతలు చేపడుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News