Pahalgam Terror Attack: ఆ నరహంతకులని పట్టిస్తే 20 లక్షలు ఇస్తాం.. అనంత్ నాగ్ పోలీసుల సంచలన ప్రకటన

Anantnag Police announces Rs 20L reward: కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల హింసాత్మక దాడితో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది.  అమాయక పర్యాటకులపై విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 28 మంది మృతి చెందడం పై యావద్దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.  

Written by - Bhoomi | Last Updated : Apr 23, 2025, 09:59 PM IST
Pahalgam Terror Attack: ఆ  నరహంతకులని పట్టిస్తే 20 లక్షలు ఇస్తాం.. అనంత్ నాగ్ పోలీసుల సంచలన ప్రకటన

Anantnag Police announces Rs 20L reward: కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల హింసాత్మక దాడితో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది.  అమాయక పర్యాటకులపై విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 28 మంది మృతి చెందడం పై యావద్దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.  అయితే ఇప్పటికే రక్షణ  దళాలు,కాశ్మీర్ పోలీసులు,  పారా మిలిటరీ దళాలు రంగంలోకి దిగి  ఉగ్రవాదుల కదలికలపై పెద్ద ఎత్తున సర్చ్ ఆపరేషన్లో ప్రారంభించారు.  

Add Zee News as a Preferred Source

నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనైనా అదుపులోకి తీసుకుంటామని ఇందుకోసం పౌరులు కూడా సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.అంతేకాదు  అనంతనాగ్ అనంతనాగ్ పోలీస్‌లు పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన ఉగ్రవాదులపై సమాచారం అందించే వారికి రూ. 20 లక్షల నగదు బహుమతి ఇస్తామిన ఇప్పటికే ప్రకటించారు. 

ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకొని శిక్షించేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని  ఈ సందర్భంగా వారు తెలిపారు.ఇదిలా ఉంటే మంగళవారం ప్రహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 28 మంది మృతి చెందగా 20 మంది శతకాత్రులు అయ్యారు వీరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.  అయితే  ఈ ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతిని వ్యక్తం చేయగా, ఉగ్రవాదంపైన  ఇకపై కఠినంగా వ్యవహరించాలని  ప్రపంచ దేశాల నుంచి ముక్తకంఠంతో ఈ ఘటనను ఖండిస్తూ సందేశాలు అందుతున్నాయి.  

ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసర క్యాబినెట్ సెక్యూరిటీ కమిటీ సమావేశం నిర్వహించి తదుపరి చర్యలపై ఆదేశాలు జారీ చేశారు.ఈ సమావేశంలో  దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్,కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు.జమ్మూ కశ్మీర్‌లో నెలకొన్న భద్రతా పరిస్థితులపై చర్చ జరిపారు.

 

Also Read: Encounter: జమ్మూకశ్మీర్ లో మరోసారి కాల్పుల కలకలం..కుల్గామ్ లో భారీ ఎన్ కౌంటర్..భద్రతా బలగాలకు  చిక్కిన TRF కమాండర్?   

ఇదిలా ఉంటే కశ్మీర్లోయలో ఇప్పటికీ ఉద్రిక్తత కొనసాగుతున్నట్లు సమాచారం అందుతోంది. ఉగ్రవాదులను జల్లెడ పట్టేలా  రక్షణ దళాలు రంగంలోకి దిగి  పొరపాటుదారులను వెతికే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు  బుధవారం బారముల్లా జిల్లాలో LOC వద్ద ఆర్మీ ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని తిప్పికొట్టినట్లు సమాచారం అందుతోంది. ఉరి ప్రాంతం ద్వారా  భారత భూభాగంలోకి చొరబాటుకు ప్రయత్నిస్తున్న  ఇద్దరు ఉగ్రవాదులను రక్షణ దళాలు  కాల్పులు జరిపి హతమార్చాయి.  

కుల్గాం జిల్లా తంగమర్ ప్రాంతంలో సైతం ఒక ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా దళాలు సోదాలు నిర్వహిస్తుండగా, ఉగ్రవాదులు  ఎదురు కల్పులు జరిపారు కౌంటర్ ఎటాక్ లో భాగంగా  పోరాటం  చోటుచేసుకుంది అయితే దీనికి సంబంధించిన  సమాచారం ఇంకా అధికారికంగా వెలువడలేదు. దేశభద్రతను సవాలు చేసే శక్తులకు దేశంలో ఎలాంటి చోటు లేదని ఈ సందర్భంగా  ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్ సైతం  ఉగ్రవాదుల చర్యను  తీవ్ర పదజాలంతో ఖండించారు. బాధిత కుటుంబాలకు తమ సానుభూతిని ప్రకటించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News