Anil Ambani: అనిల్ అంబానీపై అసత్య ప్రచారం జరుగుతుందా? ED సమన్ల నేపథ్యమేంటి? 15 ఏళ్ల క్రితం జరిగిన FEMA కేసుపైనే ఇప్పుడు విచారణ ఎందుకు?

Anil Ambani: దిగ్గజ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీపై మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడంపై ఆయన ప్రతినిధులు స్పందించారు. అనిల్ అంబానీపై ED జారీ చేసిన సమన్లు PMLA కాదని.. 2010లో జరిగిన జైపూర్–రీంగస్ హైవే ప్రాజెక్టుకు సంబంధించిన FEMA విచారణ మాత్రమే అని వివరణ ఇచ్చారు. ఇది పూర్తిగా దేశీయ ఒప్పందమని పేర్కొన్నారు. ఇందులో విదేశీ లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. అంబానీ అప్పట్లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాత్రమే ఉన్నారని వెల్లడించారు. అనిల్ అంబానీ వర్చువల్ విచారణకు సిద్ధంగా ఉన్నారని ఆయన ప్రతినిధులు తెలిపారు.

Written by - Bhoomi | Last Updated : Nov 14, 2025, 10:43 AM IST
Anil Ambani: అనిల్ అంబానీపై అసత్య ప్రచారం జరుగుతుందా? ED సమన్ల నేపథ్యమేంటి? 15 ఏళ్ల క్రితం జరిగిన FEMA కేసుపైనే ఇప్పుడు విచారణ ఎందుకు?

Anil Ambani: కేంద్ర పరిశోధన సంస్థ (ED) తాజాగా జారీ చేసిన సమన్లపై అనిల్ అంబానీ  తరఫున స్పష్టమైన వివరణ వెలువడింది. వీటిని మీడియాలోని కొన్ని వర్గాలు తప్పుగా PMLA కేసుగా ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఇదంతా అసత్య ప్రచారమని కొట్టిపారేశారు. వాస్తవానికి ఈ సమన్లు FEMA (Foreign Exchange Management Act) విచారణకు సంబంధించినవేనని ఆయన ప్రతినిధులు అధికారికంగా తెలిపారు.

Add Zee News as a Preferred Source

నవంబర్ 3, 2025న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట్  విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ కేసు జైపూర్–రీంగస్ హైవే ప్రాజెక్టుకి సంబంధించిందని స్పష్టం చేశారు. ఈ విషయం ఇప్పుడు కొత్తగా జరిగింది కాదని.. దాదాపు 15ఏళ్ల క్రితం అనగా 2010లో జరిగిన ఒక ఒప్పందంపై పరిశీలన మాత్రమేనని వివరణ ఇచ్చారు. ఆ సమయంలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ జేఆర్ టోల్ రోడ్ నిర్మాణం కోసం ఈపీసీ కాంట్రాక్టును ఒక రోడ్డు కాంట్రాక్టర్ కు అప్పగించింది. ఇది పూర్తిగా దేశీయ ఒప్పందం మాత్రమే. ఇందులో ఎలాంటి విదేశీ మారక ద్రవ్య లావాదేవీలు జరగలేదు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 2021 నుంచి జేఆర్ టోల్ రోడ్డు ప్రస్తుతం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉంది. 

అంబానీ తరపున ప్రతినిధులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం.. "2007 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు దాదాపు 15 సంవత్సరాలపాటు ఆయన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. అంటే కంపెనీ రోజువారీ నిర్వహణ, నిర్ణయాలు, ఆర్థిక వ్యవహారాల్లో ఆయనకు ఎటువంటి ప్రత్యక్ష బాధ్యత లేదు. ప్రస్తుతం కూడా ఆయన బోర్డు సభ్యుడు కాదు. అందువల్ల, ఈ కేసులో ఆయనకు సంబంధించిన వ్యవహారం పూర్తిగా పరిమితమైన, నాన్-ఎగ్జిక్యూటివ్ బాధ్యతల పరిధిలోనే ఉంది. అంబానీ వర్చువల్‌గా విచారణకు హాజరయ్యేందుకు తన సిద్ధతను కూడా EDకి తెలియజేశారు.." అని తెలిపారు.

Also Read: Gold Rate Today: ట్రంప్ ఎఫెక్ట్.. అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పతనమైన పసిడి ధర.. నవంబర్ 14వ తేదీ శుక్రవారం ధరలు ఇవే..!!  

ఇకపై మీడియాలో వచ్చిన  మనీ లాండరింగ్ కేసు, PMLA విచారణ వంటి వార్తలు వాస్తవాలకు దూరంగా ఉండటమే కాకుండా అపోహలు సృష్టించే విధంగానే ఉన్నాయని ఆయన బృందం పేర్కొంది. ఈ సమన్లు కేవలం FEMA సంబంధిత సాంకేతిక అంశాల పరిశీలన మాత్రమేనని స్పష్టంచేశారు. ఈ విధంగా, వాస్తవాలను పక్కగా వివరించిన అంబానీ బృందం.. ఈ కేసులో ఎలాంటి విదేశీ లావాదేవీలు లేదా మనీ లాండరింగ్ ఆరోపణలు లేవని స్పష్టం చేసింది. FEMA చట్టం పరిధిలో ఉన్న ఒక పాత ప్రాజెక్టుపై మాత్రమే ED ప్రశ్నలు అడుగుతోందని తెలియజేశారు.

Also Read: Pension Rules: ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ మార్చిన కేంద్రం.. ఆ పనిచేస్తేనే పెన్షన్..!!

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News