)
APCRDA Recruitment 2025: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. విజయవాడ CRDAలో ఖాళీగా ఉన్న మేనేజర్, ఇంజినీర్, డిజైన్, కాంట్రాక్ట్, క్వాలిటీ ఎక్స్పర్ట్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికన జరుగనున్న ఈ నియామకాల కోసం అప్లికేషన్స్‌ని కోరుతోంది. ఇందుకు సంబందించిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 5వ తేదీన మొదలు కాగా.. సెప్టెంబర్ 19వ తేదీతో ముగియనుంది. కాబట్టి.. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా crda.ap.gov.in ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు మరియు ఖాళీల వివరాలు..
1. ప్లానింగ్ మేనేజర్ (PMU): 1 పోస్టు
2. ప్లానింగ్ ఇంజినీర్ (PMU): 4 పోస్టులు
3. సీనియర్ కాంట్రాక్ట్స్ ఎక్స్పర్ట్: 1 పోస్టు
4. సీనియర్ డిజైన్ ఎక్స్పర్ట్: 1 పోస్టు
5. సీనియర్ క్వాలిటీ ఎక్స్పర్ట్: 1 పోస్టు
అర్హతలు..
* అభ్యర్థులు B.Tech/B.E లేదా M.E/M.Techలో ఉత్తీర్ణులై ఉండాలి.
* సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.
వేతన వివరాలు..
ప్లానింగ్ మేనేజర్ జీతం నెలకు రూ. 1,40,000.
ప్లానింగ్ ఇంజినీర్ జీతం నెలకు రూ. 1,00,000.
సీనియర్ కాంట్రాక్ట్స్ ఎక్స్పర్ట్ జీతం నెలకు రూ. 1,96,000.
సీనియర్ డిజైన్ ఎక్స్పర్ట్ & సీనియర్ క్వాలిటీ ఎక్స్పర్ట్ జీతం నెలకు రూ. 1,60,000.
దరఖాస్తు ప్రక్రియ..
అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా crda.ap.gov.in ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు వ్యవధి..
సెప్టెంబర్ 5, 2025 నుండి సెప్టెంబర్ 19, 2025 వరకు ఉంది.
పనిచేయు ప్రదేశం..
APCRDA, విజయవాడ – అమరావతి
అర్హత కలిగిన అభ్యర్థులు గడువు ముగిసేలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం APCRDA అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook