)
7th Class Qualification Jobs: ఇన్ని రోజులు కేవలం 7వ తరగతి వరకు మాత్రమే చదివామని ఫీల్ అయ్యారా..? అయితే ఇక నుండి మీరు అలా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు సెవెంత్ క్లాస్ పాస్ అయితే చాలు.. అదిరిపోయే జీతంతో ఏపీ జిల్లా కోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇంకేందుకు ఆలస్యం ఈ అద్భుతమైన అవకాశం మీరు కూడా వినియోగించుకోండి.
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా కోర్టులో వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలు ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవ్వగా.. సెప్టెంబర్ 12 వరకు కొనసాగనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు westgodavari.dcourts.gov.in వెబ్సైట్లో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
జాబ్స్, ఖాళీల డీటెయిల్స్..
ఈ ఉద్యోగాల్లో హెడ్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, స్టెనో కమ్ టైపిస్ట్, అటెండర్ పోస్టులు ఉన్నాయి.
1. హెడ్ క్లర్క్ పోస్టులు-03
2. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు-03
3. స్టెనో కమ్-టైపిస్ట్ పోస్టులు-02
4. అటెండర్ పోస్టులు-03
క్వాలిఫికేషన్స్ ఇవే..
ఈ పోస్టులకు 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హత ఉండాలి మరియు కొన్ని పోస్టులకు టైపింగ్ నైపుణ్యం కూడా అవసరం.
వయోపరిమితి ఎంత ఉండాలంటే..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం వివరాలు..
* హెడ్ క్లర్క్‌కు నెలకు 44,570 రూపాయలు
* జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్‌కు 25,220 రూపాయలు
* స్టెనో కమ్ టైపిస్ట్‌కు 34,580 రూపాయలు
* అటెండర్‌కు 20,000 రూపాయలు జీతంగా ఇస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook