Money: 60ఏళ్లు దాటిన వారిని ఈ ప్లాన్‌లో చేర్చండి.. 5 వేల పెన్షన్ వస్తుంది!

Atal Pension Yojana: 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతినెలా పెన్షన్ పొందాలనుకుంటే ఈ స్కీములో చేరవచ్చు. అటల్ పెన్షన్ యోజనలో చేరిన వారు 60ఏళ్ల  తర్వాత నెలకు రూ. 1000, 2000, 3000, 4000 లేదా 5000 వరకు పెన్షన్ పొందవచ్చు. ఈ స్కీము గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Feb 28, 2025, 12:06 PM IST
Money: 60ఏళ్లు దాటిన వారిని ఈ ప్లాన్‌లో చేర్చండి.. 5 వేల పెన్షన్ వస్తుంది!

Atal Pension Yojana: మన దేశ ప్రజలకు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడినవారిని ఆర్థికంగా చేయూతను ఇచ్చేందుకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందించింది. అలాంటి పథకాల్లో అటల్ పెన్షన్ యోజన స్కీము కూడా ఒకటి. 2015 కేంద్రంలోని మోదీ సర్కార్ ఈ స్కీమును ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. వ్యవస్థీకృత రంగంలో పనిచేయకుండా, వృద్ధాప్యంలో ఆర్థిక స్వాతంత్ర్యం లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఈ పథకం ఒక మద్దతుగా నిలుస్తుంది. రోజువారీ వేతన జీవులు, చిన్న వ్యాపార యజమానులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

Add Zee News as a Preferred Source

60 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఈ పథకంలో చేరి, ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పెన్షన్‌గా పొందవచ్చు. అటల్ పెన్షన్ యోజనలో చేరిన వారు 60 సంవత్సరాల వయస్సు తర్వాత నెలకు రూ. 1000, 2000, 3000, 4000 లేదా 5000 వరకు పెన్షన్ పొందవచ్చు. వారి వయస్సును బట్టి ప్రతి నెలా ఒక చిన్న మొత్తాన్ని చెల్లించాలి. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా ఈ పథకంలో సభ్యులుగా చేరవచ్చు. ఈ పథకం రైతులతో సహా అసంఘటిత రంగంలో పనిచేసే వారందరికీ వర్తిస్తుంది.

Also Read: Stock Market: భారీనష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్..సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్   

వయసు పెరిగే కొద్దీ తక్కువ చెల్లించడం ద్వారా ఎక్కువ పెన్షన్ పొందే అవకాశం ఇక్కడ ఉంది. ఉదాహరణకు, 18 ఏళ్ల వ్యక్తి నెలకు కేవలం రూ. 42 చెల్లించి ఈ పథకంలో చేరవచ్చు. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 5,000 పెన్షన్ పొందవచ్చు.40 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.1,454 జమ చేసి, 60 ఏళ్ల తర్వాత రూ.5,000 పెన్షన్ పొందవచ్చు. వారి ఆర్థిక పరిస్థితిని బట్టి తక్కువ పెన్షన్ పొందాలనుకునే వారు తక్కువ ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది.

మొత్తం మీద, అటల్ పెన్షన్ యోజన వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడానికి ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు. మీరు ఇక్కడ మీ తల్లిదండ్రుల పేర్లతో కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషకరమైన  జీవితాన్ని గడపడం ప్రతి ఒక్కరి కల. కానీ ప్రభుత్వ,  ప్రైవేట్ రంగాలలో పనిచేసే వారు మాత్రమే పెన్షన్ ప్రయోజనాలకు అర్హులు అవుతారు. ఈ సౌకర్యాన్ని అందరికీ విస్తరించే ప్రణాళికను ప్రభుత్వం ఇప్పుడు పరిశీలిస్తోందని నివేదికలు చెబుతున్నాయి.

Also Read: Tirumala: తిరుమలలో మార్చి 14న ప్రత్యేక వేడుక.. ఈ భక్తులు రావొద్దని చెప్పిన టీటీడీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News