
ATM New Charges: ఆన్లైన్ చెల్లింపులు, యూపీఐ లావాదేవీలు ఎంతగా పెరిగినా ఏటీఎం వాడకం కూడా తగ్గడం లేదు. అయితే ఏటీఎం సేవలు గతంలో ఉన్నట్టు ఉచితం కాదు. పరిమితి దాటితే ఛార్జీల భారం తప్పదు. ఇప్పుడీ ఏటీఎం సేవలు మరింత ప్రియం కానున్నాయి. మే 1 నుంచి కొత్త ఏటీఎం నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికీ ఏటీఎం వినియోగించేవారికి ఇది కచ్చితంగా షాకింగ్ న్యూస్.
దేశంలోని ఏటీఎం వినియోగదారులకు ఆర్బీఐ బ్యాడ్ న్యూస్ అందించింది. డిజిటల్ చెల్లింపుల్ని మరింతగా పెంచేందుకు ఏటీఎం లావాదేవీలపై మరో కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ పరిమితి దాటి ఏటీఎం వినియోగిస్తే ఛార్జీలు పడుతుండేవి. ఇకపై ఏటీఎం ఇంటర్ ఛేంజ్ ఫీజులు కూడా చెల్లించాల్సి వస్తుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఆర్బీఐ నిర్ణయం ఏటీఎం నెట్వర్క్ తక్కువగా ఉన్న బ్యాంకులపై, ఆ కస్టమర్లపై ప్రభావం పడనుంది. ఆర్బీఐ ఇంటర్‌ఛేంజ్ ఫీజులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇకపై ఇతర బ్యాంకు ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేస్తే అదనంగా డబ్బులు కట్టాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ ఫీజు కట్టాల్సింది బ్యాంకులే అయినా సదరు బ్యాంకులు కస్టమర్ల నుంచి వసూలు చేస్తాయి.
ఇక నుంచి ఒక బ్యాంకు మరో బ్యాంకు నుంచి వసూలు చేసే ఇంటర్‌ఛేంజ్ ఫీజుల్ని కస్టమర్లపై మోపే అవకాశాలు ఉన్నాయి. ఆర్ధిక లావాదేవీలకు 2 రూపాయలు, ఆర్థికేతర లావాదేవీలకు 1 రూపాయి ఇంటర్‌ఛేంజ్ ఫీజులకు ఆర్బీఐ ఆమోదించింది. ఈ కొత్త ఛార్జీలు మే 1 నుంచి అమల్లో రానున్నాయి. గతంలో ఇంటర్‌ఛేంజ్ ఫీజు ఎప్పుడు పెరిగినా ఆ భారాన్ని బ్యాంకులు కస్టమర్లపైనే మోపాయి. ఇప్పుడు కూడా ఇదే జరగనుందని అంచనా. అయితే బ్యాంకుల నుంచి అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు.
ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ ఫీజు అంటే ఒక బ్యాంకు ఏటీఎంను వేరే బ్యాంక్ కస్టమర్ ఉపయోగిస్తే ఆ బ్యాంకుకు చెల్లించాల్సిన ఫీజు. సాధారణంగా ఇది మొత్తం లావాదేవీలో 1 శాతం ఉంటుంది. 2021 జూన్ నెలలో ఆర్బీఐ ఈ ఫీజుల్ని సవరించడంతో ఇంటర్‌ఛేంజ్ ఫీజు 17 నుంచి 19 రూపాయలకు పెరిగింది. బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి సేవలకు 6 నుంచి 7 రూపాయలకు పెంచారు. ప్రస్తుతం మెట్రో ప్రాంతాల్లో ఒక బ్యాంకు కస్టమర్ ఇతర బ్యాంకు ఏటీఎంలను నెలలో ఐదు సార్లు వాడవచ్చు. నాన్ మెట్రో ప్రాంతాల్లో నెలకు 3 మాత్రమే ఉంటాయి. మే 1 నుంచి పెరగనున్న కొత్త ఏటీఎం ఛార్జీలు కస్టమర్ పైనే పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి