Bajaj Chetak 3503: హమారా బజాజ్.. తక్కువ ధరకే ఎలక్ట్రిక్‌ స్కూటర్.. ఫీచర్లు ఇవే

Bajaj Chetak 3503: బజాజ్ ఆటో తన కొత్త చేతక్ 35 సిరీస్‌లో అత్యంత చౌకైన వేరియంట్ అయిన బజాజ్ చేతక్ 3503 ను విడుదల చేసింది. ఈ చేతక్ ధరను రూ. 1.10లక్షలుగా నిర్ణయించింది.   

Written by - Bhoomi | Last Updated : Apr 29, 2025, 08:30 PM IST
Bajaj Chetak 3503: హమారా బజాజ్.. తక్కువ ధరకే ఎలక్ట్రిక్‌ స్కూటర్.. ఫీచర్లు ఇవే

Bajaj Chetak 3503: ప్రముఖ ద్విచక్ర వాహనతయారీదారు సంస్థ అయిన బాజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిని మరింత విస్తరించింది. బజాజ్ ఆటో తన కొత్త చేతక్ 35 సిరీస్‌లో అత్యంత చౌకైన వేరియంట్ అయిన బజాజ్ చేతక్ 3503 ను విడుదల చేసింది. బజాజ్ చేతక్ 3503 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర లక్ష రూపాయల కంటే కొంచెం ఎక్కువగానే ఉంది. ఈ ధర చేతక్ 3502 కంటే దాదాపు రూ. 12,000 తక్కువ.  చేతక్ 3501 కంటే దాదాపు రూ. 20,000 తక్కువ. సరసమైన ధరకు అందిస్తున్న ఈ వేరియంట్, దాని ధరను తక్కువగా ఉంచడానికి, ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా చేయడానికి కొన్ని ఫీచర్లను తగ్గించింది.

Add Zee News as a Preferred Source

చేతక్ 3503 ఇతర చేతక్ 35 సిరీస్ వేరియంట్లలో ఉన్న అదే 3.5 kWh బ్యాటరీతో అమర్చింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 155 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది సీటు కింద 35 లీటర్ల స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంది. దీని గరిష్ట వేగం కేవలం 63 కి.మీ.లకు పరిమితం చేసింది.  ఇది ఇతర వేరియంట్‌ల కంటే కొంచెం తక్కువ. బజాజ్ చేతక్ 3503 ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే.. ఇది కొంచెం ప్రాథమిక సెటప్‌ను కలిగి ఉంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన సాధారణ LCD డిజిటల్ కన్సోల్‌ను పొందుతుంది. దీని ఛార్జింగ్ సమయం 3 గంటల 25 నిమిషాలు (0 నుండి 80 శాతం), అయితే చేతక్ 3501లో ఈ సమయం 3 గంటలు మాత్రమే. ఈ వేరియంట్‌లో సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు , ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు అందించలేదు. కానీ ఇది ఇప్పటికీ ఎకో, స్పోర్ట్ వంటి రెండు రైడింగ్ మోడ్‌లు, హిల్-హోల్డ్ అసిస్ట్, పూర్తి మెటల్ బాడీ వంటి ఉపయోగకరమైన విషయాలను పొందుతుంది. ఈ స్కూటర్ నాలుగు రంగుల్లో లభిస్తుంది. ఇందులో ఇండిగో బ్లూ, బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్, మ్యాట్ గ్రే వంటి రంగులు ఉన్నాయి.

Also Read:  Gold Rate Today: అక్షయ తృతీయ ఒకరోజు ముందు భారీగా తగ్గిన బంగారం ధర... ఏప్రిల్ 29 మంగళవారం పసిడి ధరలు ఇవే  

కొత్త చేతక్ 3503 లాంచ్ తో పాటు, ఇది కంపెనీ వెబ్‌సైట్‌లో కూడా జాబితా చేసింది.  దీని డెలివరీ త్వరలో ప్రారంభమవుతుంది. కంపెనీ త్వరలో చేతక్ 2903 వేరియంట్‌ను నిలిపివేయవచ్చు. ఇది 2.9 kWh బ్యాటరీ, 123 కిలోమీటర్ల పరిధితో వస్తుంది. చేతక్ 2903 ధర దాదాపు రూ. 98,000 (ఎక్స్-షోరూమ్), ప్రస్తుతం చేతక్  చౌకైన వేరియంట్ ఇది.బజాజ్ చేతక్ 3503 ఇప్పుడు ఓలా S1 X+, TVS iQube 3.4, అథర్ రిజ్టా S, ఆంపియర్ నెక్సస్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో నేరుగా పోటీ పడనుంది. చేతక్ బ్రాండ్ ఇప్పటికే భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో బలమైన పోటీదారుగా ఉంది. ఈ కొత్త వేరియంట్ రాకతో, దాని పట్టు మరింత బలపడుతుందని భావిస్తున్నారు. 

Also Read: Success Story: ఆయన పేరే ఒక బ్రాండ్.. 115 ఏళ్ల క్రితం పునాది పడి.. రూ. 70,000 కోట్లకు పడగెత్తిన టీవీఎస్.. సక్సెస్ స్టోరీ ఇదే  

హిల్ హోల్డ్ అసిస్ట్, కలర్ ఎల్ సీడీ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్, కాల్ మేనేజ్ మెంట్, రైడ్ మోడ్స్, ఎల్ఈడీ హెడ్ లైట్స్ ఉన్నాయి. ఇవి మెటల్ బాడీతో వస్తోంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News