Bank Holiday: మహాశివరాత్రి.. ఖాతాదారులకు అలెర్ట్‌ ఈ వారం బ్యాంకులు 2 రోజులు బంద్‌..!

Mahashivaratri 2025 Bank Holiday: బ్యాంకులు ఈ వారంలో రెండు రోజులుపాటు బంద్‌ ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాదారులు ముందుగానే ఈ విషయం తెలుసుకుని జాగ్రత్తపడండి. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ వారంలో మహాశివరాత్రితోపాటు మరో రోజు కూడా బ్యాంకులు పనిచేయవు.

Written by - Renuka Godugu | Last Updated : Feb 25, 2025, 07:13 AM IST
Bank Holiday: మహాశివరాత్రి.. ఖాతాదారులకు అలెర్ట్‌ ఈ వారం బ్యాంకులు 2 రోజులు బంద్‌..!

Mahashivaratri 2025 Bank Holiday: ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌తోపాటు కొన్ని స్థానిక పండుగల సమయంలో కూడా బ్యాంకులు బంద్‌ ఉంటాయి. సాధారణంగా బ్యాంకులకు ఆర్థిక లావదేవీలు నిర్వహించడానికి వెళతారు.  అయితే, బ్యాంకులు బంద్‌ ఉన్నా కానీ, ఏటీఎం, ఆన్‌లైన్‌, నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. కానీ, పెద్ద ఎత్తు డబ్బు డిపాజిట్‌, విత్‌ డ్రా చేయాలంటే మాత్రం బ్యాంక్‌ వెళ్లాల్సిందే. ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం ఫిబ్రవరిలో బ్యాంకులకు భారీగానే సెలవులు వచ్చాయి. అన్నీ ఆదివారాలతోపాటు రెండో, నాలుగో శనివారాలు కూడా బ్యాంకులు పనిచేయవు. ఇది కాకుండా ఇటీవల బ్యాంకులు ఐదు రోజులు పనిదినాల కోసం కేంద్రం వద్ద ఆర్జీ పెట్టకున్నారు బ్యాంకు ఉద్యోగులు. ఈ విధానం అమలు అయితే, కేవలం ఐదు రోజులు మాత్రమే బ్యాకులు పనిచేస్తాయి. అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో వారి పనిగంటలు ఓ 45 నిమిషాలు కూడా పెంచనున్నట్లు తెలుస్తోంది.

Add Zee News as a Preferred Source

అయితే, ఫిబ్రవరి నెలలో బ్యాంకులు సంత్‌ రవిదాస్‌ జయంతి, సాధారణ ఎన్నికలు, ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్‌ ఉన్నాయి. అయితే రేపు మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26 బుధవారం బ్యాంకులు బంద్‌ ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూ, కశ్మీర్‌,కేరళ, ఉత్తర ప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అన్నీ పబ్లిక్‌, ప్రైవేటు రంగ బ్యాంకులకు సెలవు ఉండనుంది. ఇది కాకుండా ఫిబ్రవరి 28వ తేదీ ఈ నెల చివరిరోజు కూడా సిక్కిం గ్యాంగ్‌టాక్‌లో కూడా లోజర్‌ సందర్భంగా బ్యాంకులు బంద్‌ ఉంటాయి. ఇది కూడా అన్నీ పబ్లిక్‌, ప్రైవేటు రంగ బ్యాంకులకు వర్తించనుంది.

ఇదీ చదవండి:  సొరంగం మళ్లీ కూలింది.. 3 రోజులు గడిచినా దొరకని కార్మికుల ఆచూకీ, నేడు ప్రభుత్వం కీలక ప్రకటన..?

ఫిబ్రవరి బ్యాంక్ హాలిడేస్..
ఫిబ్రవరి నెలలో భారీగానే బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 3వ తేదీ సరస్వతి పూజ, మునిసిపల్ కార్పొరేషన్ జనరల్ ఎలక్షన్  నేపథ్యంలో ఫిబ్రవరి 11వ తేదీ, సంత్‌ రవిదాస్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 12వ తేదీ, ఫిబ్రవరి 15 లూయి నాగి -ని బ్యాంకులు బంద్, ఇక చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19వ తేదీ, ఫిబ్రవరి 20 స్టేట్ డే, ఫిబ్రవరి 21 జనరల్ ఎలక్షన్స్, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి, ఫిబ్రవరి 28 లోజర్ సందర్భంగా ఫిబ్రవరిలో భారీగా బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఇవి ఆయా ప్రాంతాల పండుగలు ఇతర ప్రత్యేక సందర్భంగా స్థానిక ఆధారంగా సెలవులు వర్తిస్తాయి.

ఇదీ చదవండి: అరటిపండు ఈ మాస్క్‌తో అందరూ మీ వైపే చూస్తారు.. బ్యూటిఫుల్ స్కిన్ మీ సొంతం..

ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారం బ్యాంకులకు సెలవులు వర్తిస్తాయి. ఇదిలా ఉండగా బ్యాంకులకు ఐదు రోజులు పనిదినాలు అమలు చేయాలని మార్చి నెలలో ఆల్‌ ఇండియా బ్యాంక్‌ అసోసియేషన్‌ ఉద్యోగులు స్ట్రైక్‌ నిర్వహించున్నున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 24, 25 తేదీల్లో బ్యాంకులు బంద్‌ ఉండునున్నాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News