)
Bank Jobs 2025: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ 2025 సెప్టెంబర్ 11న ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ sbi.bank.in ద్వారా అక్టోబర్ 2, 2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు:
ఈ నియామక ప్రక్రియలో 122 మేనేజర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్–III కింద నియమిస్తారు.
జీతం:
SBIలో మేనేజర్‌గా ఎంపికైతే, అభ్యర్థులకు నెలకు రూ. 85,920 నుండి రూ. 1,05,280 వరకు జీతం లభిస్తుంది. అదనంగా, బ్యాంక్ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. నియామకం తర్వాత 6 నెలల ప్రొబేషన్ పీరియడ్ తప్పనిసరిగా పూర్తి చేయాలి.
అర్హతలు:
అనుభవం: కార్పొరేట్ క్రెడిట్ లేదా హై-వాల్యూ క్రెడిట్ రంగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
టెక్నికల్ నైపుణ్యాలు: క్రెడిట్ మానిటరింగ్, బ్యాలెన్స్ షీట్ అర్థం చేసుకోవడం, ఫైనాన్షియల్ అనాలిసిస్ వంటి అంశాలలో అనుభవం ఉండాలి.
విద్యార్హతలు: నోటిఫికేషన్లో సూచించిన విధంగా డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం:
-ముందుగా sbi.bank.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి లేదా లాగిన్ అవ్వాలి.
-దరఖాస్తు ఫారమ్‌ను సరిగ్గా పూరించి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.
- జనరల్ OBC కేటగిరీ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి.
- SC, ST, దివ్యాంగ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
-దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 11, 2025
-చివరి తేదీ: అక్టోబర్ 2, 2025
SBIలో మేనేజర్‌గా పని చేయడం ప్రతిష్టాత్మకమే కాకుండా, ఆకర్షణీయమైన జీతభత్యాలు, కేరీర్ గ్రోత్, సెక్యూర్ జాబ్ దేశవ్యాప్తంగా పని చేసే అవకాశం లభిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో భవిష్యత్తు బలంగా ఉండాలని ఆశించే వారికి ఈ అవకాశం తప్పక ఉపయోగపడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.