Bank Holidays May 2024: బ్యాంకు సెలవులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పబ్లిక్ హాలిడేస్ రెండవది రీజినల్ హాలిడేస్. ప్రతి బ్యాంకుకు దేశమంతా రెండవ, నాలుగవ శనివారంతో పాటు నాలుగు ఆదివారాలు అంటే మొత్తం 6 రోజులు కచ్చితంగా సెలవులుంటాయి. ఇవి కాకుండా జాతీయ, ప్రాంతీయ సెలవులుంటాయి. అందుకే ఆర్బీఐ ప్రతినెలా జారీ చేసే బ్యాంకు సెలవుల జాబితాను పరిశీలిస్తుండాలి. లేకపోతే బ్యాంకు పనులుంటే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి మే నెల బ్యాంకు సెలవులు రెండు శనివారాలు, నాలుగు ఆదివారాలతో కలిపి 6 కాకుండా మరో 8 ప్రాంతీయ, జాతీయ సెలవులున్నాయి. మే 1 మేడే కాకుండా ఇతర సెలవులున్నాయి. వీటిలో దాదాపు 6 సెలవులు ఎక్కడికక్కడ వివిధ రాష్ట్రాలకు ఉన్న సెలవులు మాత్రమే. దేశమంతా వర్తించవు. కానీ ఒకరోజు మాత్రం దాదాపు దేశంలోని అన్ని బ్యాంకులు పనిచేయవు. ముఖ్యంగా దేశంలోని 18 రాష్ట్రాల్లో ఆ రోజు బ్యాంకులకు సెలవుంది. అదే గురు పౌర్ణిమ. మే 23న గురు పౌర్ణిమ సందర్భంగా దేశంలోని దాదాపు 18 రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.


మే 23 గురువారం నాడు దేశంలో అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, ఈటానగర్, జమ్ము, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగపూర్, న్యూ ఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, షిమ్లా, శ్రీనగర్ రాష్ట్రాల్లో గురు పూర్ణిమ లేదా బుద్ధ పూర్ణిమ పురస్కరించుకుని బ్యాంకులు పనిచేయవు. మే 25న నాలుగో శనివారం, మే 26 ఆదివారం సెలవులున్నాయి. అందుకే వచ్చేవారం బ్యాంకు పనులుంటే ఈ సెలవుల్ని పరిగణలో తీసుకుంటే మంచిది.లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. 


Also read: Toyota Innova Bookings: డిమాండ్ తట్టుకోలేక చేతులెత్తేసిన ఇన్నోవా, బుకింగ్స్ నిలిపివేత>



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook