Best 7-Seater Car: అతి తక్కువ బడ్జెట్‌లో 7 సీట్ల కారు.. సూపర్ ఫీచర్స్ ఇవే..!

Best 7 Seater Car in India: తక్కువ బడ్జెట్‌లో 7 సీటర్ కారు కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి గుడ్‌న్యూస్. రెనాల్ట్ 2025 కొత్త వేరియంట్ భారత్‌లో లాంచ్ అయింది. ఈ కారు ఫీచర్లు, ధర పూర్తి వివరాలు ఇలా..   

Written by - Ashok Krindinti | Last Updated : Nov 7, 2025, 07:07 PM IST
Best 7-Seater Car: అతి తక్కువ బడ్జెట్‌లో 7 సీట్ల కారు.. సూపర్ ఫీచర్స్ ఇవే..!

Best 7 Seater Car in India: ప్రస్తుతం కార్ల ధరలు తగ్గిపోవడంతో ఎక్కువ మంది తమ కలను నెరవేర్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల దీపావళి సందర్భంగా ఓ రేంజ్‌లో కార్ల అమ్మకాలు జరిగిన విషయం తెలిసిందే. మీకు ఫ్యామిలీతో కలిసి వెళ్లేందుకు కారు కోసం చూస్తున్నట్లయితే రెనాల్ట్ భారత్‌లో కొత్త వేరియంట్‌ను తీసుకువచ్చింది. కొత్త రెనాల్ట్ ట్రైబర్ 2025 ను పరిచయం చేసింది. బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ MPV ని రిఫ్రెషింగ్ డిజైన్, అధునాతన ఫీచర్లు, ఫైన్-ట్యూన్డ్ ఇంజిన్ సెటప్‌తో ఈ కారును డిజైన్ చేసింది. అప్‌డేటెట్ ఇంటీరియర్స్, మెరుగైన పనితీరు, స్మార్ట్ టెక్నాలజీతో, కాంపాక్ట్ సెవెన్-సీటర్ సౌకర్యంతో వినియోగదారుల ముందుకు తీసుకువచ్చారు. 

Add Zee News as a Preferred Source

రెనాల్ట్ ట్రైబర్ 2025 మోడల్‌ను పూర్తిగా రీడిజైన్‌తో తీసుకువచ్చారు. కారు లుక్ మరింత ప్రీమియంగా కనిపించేలా డిజైన్ చేశారు. కొత్త క్రోమ్-స్టడెడ్ ఫ్రంట్ గ్రిల్ సొగసైన LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో పర్ఫెక్ట్‌గా విలీనం అవుతుంది. ఫ్రంట్ బంపర్ విశాలమైన ఎయిర్ డ్యామ్‌లను, స్పోర్టీ సిల్వర్ స్కిడ్ ప్లేట్‌ను అమర్చారు. ఈ కారును పక్క నుంచి చూస్తే.. 16-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, కాంట్రాస్టింగ్ బ్లాక్ క్లాడింగ్, సిల్వర్ రూఫ్ రైల్స్‌తో అథ్లెటిక్ అప్పీల్‌తో కనిపిస్తుంది. వెనుక వైపున రెనాల్ట్ బోల్డ్ క్రోమ్ స్ట్రిప్, బూట్ మూతలోకి విస్తరించి ఉన్న C-ఆకారపు LED టెయిల్ లాంప్‌లతో టెయిల్‌గేట్‌ను మరింత మెరుగుపరిచారు.

ఫైరీ రెడ్, ఎలక్ట్రిక్ బ్లూ, మూన్‌లైట్ సిల్వర్, మెటల్ మస్టర్డ్, ఐస్ కూల్ వైట్ వంటి కొత్త రంగులలో అందుబాటులో ఉంది. కారు లోపల గతంలో కంటే మరింత విశాలంగా.. మరింత ప్రీమియంగా డిజైన్ చేశారు. క్యాబిన్ డిజైన్ డ్యూయల్-టోన్ బ్లాక్-అండ్-బీజ్ థీమ్‌తో వస్తుంది. డ్యాష్‌బోర్డ్ సాఫ్ట్-టచ్ ఇన్సర్ట్‌లు, మెటాలిక్ యాక్సెంట్‌లతో పూర్తిగా అప్‌గ్రేడ్ చేశారు. మధ్యలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేసే బ్రాండ్-న్యూ 10.25-అంగుళాల ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ కూడా ఉంది.

ఈ కారులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అన్ని వరుసలకు AC వెంట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, USB పోర్ట్‌లు అన్ని ఉన్నాయి. 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో కొనసాగుతోంది. ఇది దాదాపు 72 PS పవర్, 96 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. నగరంలో డ్రైవింగ్ చేసేందుకు చాలా కంఫర్ట్ ఉంటుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 5-స్పీడ్ AMT ఆటోమేటిక్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో దాదాపు 25 kmpl మైలేజీ, AMT గేర్‌బాక్స్‌తో దాదాపు 23 kmpl మైలేజీని ఇస్తుంది. టర్బో-పెట్రోల్ వేరియంట్ 22 kmpl వరకు మైలేజీని ఇస్తుంది.

రెనాల్ట్ ట్రైబర్ 2025 ను మాన్యువల్, AMT ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో వచ్చింది. బేస్ RXE మోడల్ ప్రారంభ ధర దాదాపు రూ.6.49 లక్షలు (ఎక్స్-షోరూమ్), టాప్-ఎండ్ RXZ టర్బో రూ.10.49 లక్షల వరకు ఉంటుంది. SUV లుక్‌తో బెస్ట్ మైలేజీతో ఏడుగురు కలిసి వెళ్లగల ఈ కారు.. ఫ్యామిలీతో ట్రిప్స్‌ వెళ్లే వారికి బెస్ట్ ఆప్షన్. 

Also Read: Automatic Cars: కారు కొనాలని ఆలోచిస్తున్నారా? ఆటోమేటిక్ కారు లాభమా, నష్టమా..5 నిమిషాల్లో తెలిసిపోతుంది!

Also Read: Honda Livo: కేవలం రూ.77,000 ధరకే అద్భుమైన మైలేజ్‌..110 సీసీ బైక్‌ దుమ్మురేపే స్పెషల్ ఆఫర్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News