Jio Hotstar Plans: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ఇప్పుడు కొత్త ప్లాన్స్ అందిస్తున్నాయి. ఇందులో భాగంగా మూడు నెలల అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటాతో పాటు 90 రోజుల ఉచిత జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్నాయి. ఈ ప్లాన్స్ తీసుకుంటే మూడు నెలల వ్యాలిడిటీతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా లభిస్తాయి. అంతకుమించి వచ్చే ఐపీఎల్ 2025 సీజన్ ఎలాంటి అంతరాయ లేకుండా చూసేందుకు జియో హాట్‌స్టార్ ఫ్రీ స్ట్రీమింగ్ ఎంజాయ్ చేయవచ్చు.
మూడు నెలల వ్యాలిడిటీ ప్లాన్స్ తీసుకోవడం వల్ల తరచూ రీచార్జ్ బాధ ఉండదు. ఒకసారి రీఛార్జ్ చేయించుకుంటే 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు బెస్ట్ డేటా ప్యాక్స్ అందిస్తున్నాయి. ఎయిర్‌టెల్ 929 రూపాయల రీఛార్జ్ ప్లాన్ తీసుకుంటే ఇది 90 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా ఉంటుంది. ఈ ప్లాన్ తీసుకుంటే స్నాప్ కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్, అపోలో 24 గంటల సేవలు, ఉచిత హెలో ట్యూన్స్ లభిస్తాయి.
ఇక జియో 899 రూపాయల ప్లాన్ తీసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అదనంగా 20 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. ఇందులో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించవచ్చు. జియో టీవీ, జియో క్లౌడ్ , అన్‌లిమిటెడ్ 5జి డేటా లభిస్తాయి. జియోలో మరో ప్లాన్ 195 రూపాయలకు ఉంది. ఇది కేవలం డేటా ప్లాన్ కానీ 90 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఇందులో 15 జీబీ డేటాతో పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ మూడు నెలలు ఉచితంగా లభిస్తుంది. జియో 100 రూపాయలకు మరో డేటా ప్యాక్ అందిస్తోంది. ఇందులో 5జీబీ డేటా లభిస్తుంది. 90 రోజులకు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
Also read: Telangana: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఖరారు, ఊహించని విధంగా విజయశాంతి పేరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









