)
Bitcoin Price Down Today: అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ విలువ ఒక్కసారిగా కుప్పకూలింది. శుక్రవారం అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆందోళన కారణంగా భారీగా పతనమైంది. ఏప్రిల్ నెల తరువాత అత్యంత భారీగా $83,000 కంటే తక్కువకు పడిపోయింది. దీంతో పాటు ఇతర క్రిప్టోకరెన్సీలు కూడా పడిపోయాయి. బిట్ కాయిన్ విలువ 1.71 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా.. గత 24 గంటల్లో 94 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ప్రస్తుతం అంతర్జాతీయ క్రిప్టో ఎక్స్ఛేంజ్ Coinmarketcap లో బిట్‌కాయిన్ ధర దాదాపు 82,260 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ నెలలో దాదాపు 23 శాతం తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. గత మూడేళ్లలో ఒక నెలలోనే భారీస్థాయిలో పతనమైనట్లు పేర్కొంటున్నారు.
ఇవి కూడా నష్టాల్లోనే..
బిట్‌కాయిన్‌తోపాటు Ethereum, Solana వంటి అనేక క్రిప్టోకరెన్సీలు కూడా నష్టాల బాట పట్టాయి. ట్రంప్ సర్కార్ క్రిప్టోకు అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నా.. క్రమంగా మార్కెట్ క్షీణిస్తోంది. గత నెలలో బిట్‌కాయిన్ 126,000 డాలర్ల వద్దకు చేరగా.. ఈ నెలలో మాత్రం భారీ నష్టాలను చవిచూసింది. అప్పటి నుంచి బిట్‌కాయిన్ ధర 30 శాతం పడిపోయింది. సంస్థాగత పెట్టుబడిదారుల అమ్మకాలు, గత నెలలో 800,000 కంటే ఎక్కువ బిట్కాయిన్లు అమ్ముడవ్వడం క్రిప్టో మార్కెట్‌పై కూడా ప్రభావం చూపింది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో డిజిటల్ ఆస్తులలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఇవాళ మరింత పతనమైంది. US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపై అనుమానాలు రేకెత్తుతుండడంతో పెట్టుబడిదారులు క్రిప్టో కరెన్సీ నుంచి తమ ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి తీసుకుంటున్నారు.
సంస్థాగత ఇన్వెస్టర్లపై మార్జిన్ ఒత్తిడి
క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 2.8 ట్రిలియన్లు డాలర్లు కాగా.. గత నెల ప్రారంభంలో ఇది దాదాపు 4.4 ట్రిలియన్లు డాలర్లుగా ఉండేది. బిట్‌కాయిన్‌లో అధిక అమ్మకాలు క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేసిన మైక్రోస్ట్రాటజీ వంటి సంస్థాగత ఇన్వెస్టర్లపై మార్జిన్ ఒత్తిడిని పెంచుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ తయారీదారు బిట్‌కాయిన్‌లో అధిక మొత్తంలో పెట్టుబడిని కలిగి ఉండగా.. ఈ క్షీణతతో దాని షేర్లు 5 శాతానికి పైగా పడిపోయాయి.
గత నెలలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా నుంచి దిగుమతులపై 100 శాతం సుంకాన్ని ప్రకటించినప్పటి నుంచి బిట్‌కాయిన్‌తో సహా అనేక క్రిప్టోకరెన్సీలో భారీ అమ్మకాలు పెరిగాయి. ఈ క్షీణత క్రిప్టో మార్కెట్లో మరో నాలుగేళ్లు బేరిష్ సైకిల్ ప్రారంభానికి సంకేతంగా ఉందా అని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అదేజరిగితే.. అమ్మకాలు ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంది. ఇది బిట్‌కాయిన్ ధరలలో మరింత తగ్గుదలకు దారి తీయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook