BSNL Recharge Plans: దేశంలోనే అత్యంత చౌక ప్లాన్ ఇదే రోజుకు 3 జీబీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ

BSNL Recharge Plans: దేశంలో గత కొద్దికాలంగా బీఎస్ఎన్ఎల్‌కు ఆదరణ పెరుగుతోంది. ప్రైవేట్ టెలీకం కంపెనీల టారిఫ్ పెంచడం ఓ కారణమైతే, బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్లాన్స్ కూడా మరో కారణం. ఇప్పుడు మరో రెండు చీప్ అండ్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించింది. ఈ రెండు ప్లాన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 20, 2025, 05:25 PM IST
BSNL Recharge Plans: దేశంలోనే అత్యంత చౌక ప్లాన్ ఇదే రోజుకు 3 జీబీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ

BSNL Recharge Plans: బీఎస్ఎన్ఎల్ దేశంలోని ప్రైవేట్ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలకు సవాలు విసురుతోంది. అపరిమితమైన డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌకర్యం కల్పిస్తూ లాంగ్ వ్యాలిడిటీ ఇచ్చే అత్యంత చౌక ప్లాన్స్ తీసుకొచ్చింది. ఈ రెండు ప్లాన్స్ కచ్చితంగా మార్కెట్‌లో కలకలం రేపనున్నాయి. 

Add Zee News as a Preferred Source

బీఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం అత్యంత చౌకైన మరో రెండు రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెట్టింది. ఈ రెండు ప్లాన్స్ ద్వారా ప్రైవేట్ టెలీకం కంపెనీలకు సవాలు విసురుతోంది. ఈ రెండు ప్లాన్స్‌లో ఒకటి 54 రోజుల వ్యాలిడిటీ అయితే మరొకటి 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్. ఈ ప్లాన్స్ తీసుకుంటే 400 లైవ్ టీవీ ఛానెళ్లు ఉచితంగా వీక్షించే అవకాశం ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న 347 రూపాయల ప్లాన్ ఇది. ఇందులో 54 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఇన్ని రోజుల వ్యాలిడిటీని ఇంత తక్కువకు అందించే ప్లాన్ బహుశా ఇదే కావచ్చు. ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 108 జీబీ డేటా 54 రోజులకు పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పంపించుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ ఇటీవల దేశవ్యాప్తంగా 75 వేల 4జి టవర్లు స్థాపించింది. దాంతో కనెక్టివిటీ సమస్య ఉండదు. 

ఇక రెండవ ప్లాన్ 599 రూపాయలకు వస్తోంది. ఈ ప్లాన్ తీసుకుంటే వ్యాలిడిటీ ఏకంగా 84 రోజులు ఉంటుంది. రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఎలానూ ఉంటుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. రోజుకు 3 జీబీ డేటా లెక్కన మొత్తం 252 జీబీ డేటా వాడుకోవచ్చు. ఈ రెండు ప్లాన్స్‌తో పాటు బీఎస్ఎన్ఎల్ తన యూజర్లకు బైటీవీ ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. దీని ద్వారా 400 లైవ్ టీవీ ఛానెళ్లు ఉచితంగా చూడవచ్చు. 

కేవలం 599 రూపాయలకు 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 3 జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ మరే ఇతర టెలీకం కంపెనీలోనూ లేదు. అటు 347 రూపాయల్లో రోజుకు 2 జీబీ డేటా అందిస్తూ 54 రోజుల వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్ కూడా మరెక్కడా లేదు. అందుకే ఈ రెండు ప్లాన్స్ కచ్చితంగా సంచలనం రేపనున్నాయి. 

Also read: SC Classification Bill: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం, ఏ కేటగరీలో ఎన్ని ఉప కులాలంటే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News