BSNL 99 Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌.. రూ.99తో అపరిమితమైన సేవలు

BSNL 99 Recharge Plan Details In Telugu ప్రైవేటు టెలికాం సంస్థలు ధరలు పెంచుతున్న వేళ బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు అద్భుత ప్లాన్‌లు అందిస్తోంది. మరో చిన్న ప్లాన్‌తో జియో, ఎయిర్‌టెల్‌, వీఐ సంస్థలకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ భారీ షాక్‌ ఇచ్చింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 5, 2025, 03:13 PM IST
BSNL 99 Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌.. రూ.99తో అపరిమితమైన సేవలు

BSNL 99 Recharge: ప్రస్తుత ఆధునిక కాలంలో ఏదైనా అప్‌డేట్‌ చెందితేనే మనుగడ సాధిస్తుంది. లేకుంటే మరుగనపడిపోతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు చక్కగా వర్తిస్తుంది. మానవుడి జీవితంలో టెలికాం రంగం కీలకమైన ఈ సమయంలో ప్రతి వినియోగదారుడికి సేవలు అందించడంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రైవేటు సంస్థలతో తీవ్ర పోటీ ఎదుర్కొంటుంది. వారి ఆఫర్లు, ప్రయోజనాలకు దీటుగా సేవలు అందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ సిద్ధమవుతోంది. ఈక్రమంలోనే ప్రైవేటు టెలికాం సంస్థలకు భారీ షాకిచ్చేలా.. వినియోగదారులకు సర్‌ప్రైజ్‌గా బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.99 ప్లాన్‌ అమలు చేస్తోంది.

Add Zee News as a Preferred Source

Also Read: Zee Tv Sa Re Ga Ma Pa: ప్రతిష్టాత్మక వేదికలపై 'జీ సరిగమప' సింగర్‌ల అద్భుత ప్రదర్శన

99 రూపాయలకే అపరిమిత కాల్స్‌తో సహా గొప్ప ఆఫర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ విడుదల చేసింది. ఎయిర్‌టెల్‌, జియో నుంచి పోటీ ఎదుర్కొంటున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌తో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. జియో, ఎయిర్‌టెల్‌, వీఐ వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌ను చూసి షాకయ్యాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తున్న ఈ ఆఫర్‌ వివరాలు తెలుసుకుందాం.

Also Read: Old Tax Regime: 'పన్ను చెల్లింపుదారులకు బిగ్‌ అలర్ట్‌! పాత పన్ను విధానం రద్దు లేదు'

ఎయిర్‌టెల్ జియో వినియోగదారులకు సరసమైన ధరలో 99 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించి ప్రైవేట్ టెలికాం కంపెనీలకు బీఎస్‌ఎన్‌ఎల్‌ షాక్ ఇచ్చింది. ఈ ప్లాన్‌ సంవత్సరం మొత్తం (365) వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత కాల్‌లు, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లను బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తుంది. ఉచితంగా రింగ్‌టోన్‌ను కూడా సెట్ చేసుకునే అదనపు సౌకర్యం కల్పించింది. ఇంకా మూడు జీబీ డాటా కూడా అందిస్తుండడం గమనార్హం.

ఈ విధంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారుల కోసం సరసమైన ధరలలో వివిధ ప్లాన్‌లను విడుదల చేస్తోంది. రూ.99, రూ.147, రూ.439 ప్లాన్‌లను కూడా అందిస్తోంది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో 300 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లను బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉచితంగా అందిస్తుంది. ప్రైవేట్ కంపెనీలు ధరలను పెంచుతుంటే బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం తన వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త ఆఫర్లను.. కొత్త ప్లాన్‌లను తీసుకువస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News