TDS Rules: కేంద్ర బడ్జెట్ 2025లో ప్రభుత్వం అనేక పన్ను సంబంధిత మార్పులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మూలం వద్ద పన్ను మినహాయింపులు నియామాల్లో కొన్ని మార్పులు చేసింది. ఈ మార్పులు ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ మార్పు తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారికి ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు.
టీడీఎస్ అనేది మూలం వద్ద పన్ను మినహాయింపు. బ్యాంకులో ఎప్డీపై వడ్డీ ఒక నిర్దిష్ట లిమిట్ ను మించిపోయినప్పుడు బ్యాంకు టీడీఎస్ ను తగ్గించుకోవాలి. ఈ లిమిట్ సీనియర్ సిటిజన్లకు, సీనియర్ కాని పౌరులకు భిన్నంగా ఉంటుంది. మీరు అనవసరమైన టీడీఎస్ తగ్గింపులను పదే పదే ఎదుర్కొవల్సిన అవసరం లేకుండా ఈ లిమిట్స్ ను హేతుబద్దీకరించాలని బడ్జెట్ ప్రతిపాదించింది.
సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం వడ్డీ ఆదాయంపై టీడీఎస్ లిమిట్ ను రెట్టింపు చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం వడ్డీ ఆదాయం రూ. లక్ష దాటితేనే బ్యాంకులు టీడీఎస్ ను తగ్గిస్తాయి. అంటే సీనియర్ సిటిజన్ మొత్తం వడ్డీ ఆదాయం ఈ లిమిట్ లోపు ఉంటే ఎలాంటి టీడీఎస్ తగ్గించదు. ఈ నియమం స్థిర డిపాజిట్లు, పునరావ్రుత డిపాజిట్లు, ఇతర పొదుపు సాధనాల నుంచి వచ్చే వడ్డీకి వర్తిస్తుంది.
Also Read; BSNL Recharge Plans: దేశంలోనే అత్యంత చౌక ప్లాన్ ఇదే రోజుకు 3 జీబీ డేటా, 84 రోజులు
సాధారణ పౌరుల వడ్డీ ఆదాయంపై టీడీఎస్ లిమిట్ ను రూ. 40వేల నుంచి రూ. 50వేలకు పెంచారు. మొత్తం వడ్డీ ఆదాయం రూ. 50వేల లోపు ఉంటే అప్పుడు ఎలాంటి టీడీఎస్ తగ్గించరు. ఎప్డీ వడ్డీ ఆదాయంపై ఆధారపడిన వారిపై పన్ను భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ మార్పు చేసింది.లాటరీకి సంబంధించిన టీడీఎస్ నియమాలను ప్రభుత్వం సరళించింది. గతంలో ఒక ఏడాదిలో మొత్తం విజయాలు రూ. 10, 000 దాటితే టీడీఎస్ తగ్గించేది. ఇప్పుడు రూ. 10, 000 దాటిన ట్రాన్సాక్షన్లపై మాత్రమే టీడీఎస్ తగ్గిస్తుంది.
Also Read; Janhvi Kapoor: జాన్వీ కపూర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఉపాసన కొణిదెల..
బీమా సంస్థలు, ఏజెంట్లు, బ్రోకర్లు ఇప్పుడు అధిక టీడీఎస్ థ్రెషోల్డ్ ప్రయోజనాన్ని పొందుతారు. బీమా కమిషన్ పై టీడీఎస్ లిమిట్ ను రూ. 15, 000 నుంచి రూ.20, 000వరకు పెంచారు. ఫండ్స్ షేర్లలో పెట్టుబడిపెట్టే ఇన్వెస్టర్లు ఇప్పుడు అధిక మినహాయింపు లిమిట్ బెనిఫిట్స్ పొందుతారు. డివిడెండ్ ఆదాయంపై టీడీఎస్ లిమిట్ ను రూ. 5,000నుంచి రూ. 10,000కు పెంచారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









