Maruti Suzuki Ertiga: దేశంలోనే అత్యంత విజయవంతమైన కారుగా మారుతీ ఎర్టిగా గుర్తింపు పొందింది. సక్సెస్‌ఫుల్ ఎంపీవీ కార్లలో ఒకటైన మారుతి సుజుకి ఎర్టిగా కారు మధ్య తరగతి ప్రజల విశేష ఆదరణ పొందుతోంది. నాలుగు వేరియంట్లలో వచ్చిన ఈ కారు ధరలు ఇటీవల భారీగా పెరిగాయి. గత నెల నుంచి రూ.15 వేలు పెరిగినా కూడా వినియోగదారులు వెనక్కి తగ్గడం లేదు. అందుబాటు ధరల్లో.. కుటుంబానికి సరిపడా సీటింగ్ సామర్థ్యం.. రక్షణలోను మేటిగా ఉన్న ఎర్టిగా విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా మారుతీ ఎర్టిగా వాహనం ఫీచర్లు.. సీటింగ్.. భద్రతా.. వేరియంట్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
Also Read: Jr NTR: ఎన్టీఆర్ 'భార్యకు ప్రేమతో.. లక్ష్మి ప్రణతి బర్త్ డే పిక్ వైరల్
వేరియంట్లు
మారుతి సుజుకి ఎర్టిగా నాలుగు వేరియంట్లలో లభిస్తోంది. ఎల్‌ఎక్స్‌ఐ, వీఎక్స్‌ఐ, జడ్‌ఎక్స్‌ఐ, జడ్‌ఎక్స్‌ఐ ప్లస్ వేరియంట్లు ఉన్నాయి.
ధరలు ఇలా..
ఇటీవల త్రీ-రో మారుతి సుజుకి ఎర్టిగా కారు ధర రూ.10 వేలు పెరిగింది. కార్ల ధరల పెరుగుదలకు మారుతి సుజుకి ఎటువంటి కారణం చెప్పలేదు. ఎంట్రీ లెవల్ ఎల్‌ఎక్స్‌ఐ (ఓ) వేరియంట్ రూ.15 వేలు ధర పెరిగింది. దీంతో మారుతి సుజుకి ఎర్టిగా కారు ధర రూ.8.84 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంటుంది. మిగతా అన్ని వేరియంట్లు కూడా రూ.10 వేలు పెరుగుతాయి.
Also Read: Free Parking: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మాల్స్, మల్టీప్లెక్స్‌లో పార్కింగ్ ఫ్రీ.. ఫ్రీ
మోడల్, ధరలు (రూ.లక్షల్లో) ఇలా ఉన్నాయి
ఎర్టిగా ఎల్‌ఎక్స్‌ఐ (ఓ) – రూ.8.84 లక్షలు.
ఎర్టిగా వీఎక్స్‌ఐ (ఓ) – రూ. 9.93 లక్షలు
ఎర్టిగా జడ్ఎక్స్ఐ (ఓ) – రూ.11.03 లక్షలు
ఎర్టిగా జడ్‌ఎక్స్ ఐ + – రూ. 11.73 లక్షలు
ఎర్టిగా వీఎక్స్‌ఐ ఏటీ – రూ.11.33 లక్షలు
ఎర్టిగా జడ్‌ఎక్స్‌ఐ ఏటీ – రూ.12.43 లక్షలు
ఎర్టిగా జడ్‌ఎక్స్‌ఐ ప్లస్ ఏటీ – రూ.13.13 లక్షలు
ఎర్టిగా వీఎక్స్‌ఐ (ఓఏ) సీఎన్జీ – రూ.10.88 లక్షలు
ఎర్టిగా జడ్ఎక్స్ఐ (ఓ) సీఎన్జీ – రూ. 11.98 లక్షలు
ఫీచర్లు ఇవే..
- మారుతి సుజుకి ఎర్టిగా రెండు పవర్ ట్రైన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5-లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో లభిస్తుంది.
- పెట్రోల్ వర్షన్ ఇంజిన్ గరిష్టంగా 6,000 ఆర్పీఎం వద్ద 101.6 బీహెచ్‌పీ విద్యుత్, 4,400 ఆర్పీఎం వద్ద 136.8 ఎన్‌ఎం టార్క్ ఉంటుంది.
- ఈ కారు 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- సీఎన్జీ ఇంజిన్ గరిష్టంగా 5,500 ఆర్పీఎం వద్ద 86.6 బీహెచ్‌పీ, 4,200 ఆర్పీఎం వద్ద 121.5 టార్క్ వెలువరిస్తుంది.
- సీఎన్జీ వర్షన్ కారు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









