)
CGAS Banks List: పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కలిగించింది. మూలధన లాభాల ఖాతా పథకం (CGAS) కింద డిపాజిట్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఈ డిపాజిట్లు కేవలం ప్రభుత్వ బ్యాంకులే పరిమితం చేయకుండా.. ఇతర బ్యాంకుల్లో కూడా డిపాజిట్లు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. 19 ప్రైవేట్, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు కూడా మూలధన లాభాల ఖాతా పథకం కింద చేర్చారు. దీంతో ట్యాక్స్ పేయర్లు తమ మూలధన లాభాలను కాపాడుకోవడానికి.. పన్ను మినహాయింపులను పొందేందుకు ఎక్కువ బ్యాంకులు ఎంచుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఇప్పటివరకు కేవలం కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి మాత్రమే ఈ సౌకర్యాన్ని పొందే అవకాశం ఉండేది.
ఏ బ్యాంకులు చేర్చారు..?
HDFC, ICICI, యాక్సిస్, కోటక్ మహీంద్రా, ఇండస్ఇండ్, IDFC ఫస్ట్ బ్యాంక్, RBL, యస్ బ్యాంక్, సౌత్ ఇండియన్, బంధన్ బ్యాంక్, DCB, సిటీ యూనియన్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, కరూర్ వైశ్య, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, ధనలక్ష్మి, CSB బ్యాంక్, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్‌లలో మూలధన లాభాల ఖాతా పథకం సేవలను ప్రారంభించారు. ఎవరైనా తమ భూమి, ఇళ్లు, నగలు లేదా పెట్టుబడులు వంటి ఆస్తులను అమ్మిన సమయంలో వారికి మూల ధన లాభాలు వస్తాయి. వీటిని ప్రభుత్వం నుంచి మూలధన లాభాల పన్ను (Capital Gains Tax)కు లోబడి ఉంటాయి.
ఒక వ్యక్తి తన ఆస్తిని స్వల్ప కాలానికి ఉంచితే.. దానిపై స్వల్పకాలిక లాభాలు, దీర్ఘకాలికంగా ఉంచితే.. దానిపై దీర్ఘకాలిక లాభాలు కింద ప్రభుత్వం ట్యాక్స్ విధిస్తుంది. అయితే ట్యాక్స్ ఆదా చేసుకోడానికి ప్రజలు మూలధన లాభాల ఖాతా పథకాలలో తమ డబ్బును ఇన్వెస్ట్ చేస్తారు.
CGAS ప్రయోజనాలు ఇవే..
క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ (CGAS)తో మూలధన లాభాలపై వినియోగదారు రూ.లక్ష వరకు పన్నులను ఆదా చేయవచ్చు. ఒక ఆస్తిని అమ్మి.. మరోదానిలో ఇన్వెస్ట్ చేసే విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదు. కొత్త ఆస్తిలో ఈజీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ కంటే ముందే ఇన్వెస్ట్ చేయలేకపోతే.. క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్‌లో డబ్బు జమ చేసుకుని ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook