Business ideas: కేవలం 2 లక్షల రూపాయల పెట్టుబడి.. ఇతరులకు ఉపాధి కల్పించడంతో పాటు మీరు భారీగా సంపాదించవచ్చు.

Business Idea : మీరు చిన్న వ్యాపారం ప్రారంభించానుకునే ఆలోచనలో ఉన్నట్లయితే ఈ వ్యాపారాన్ని ఓసారి చూడండి. ఎందుకంటే ఇది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఇస్తుంది. కానీ కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది. కానీ నష్టాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఈ బిజినెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Mar 30, 2025, 09:19 PM IST
Business ideas: కేవలం 2 లక్షల రూపాయల పెట్టుబడి.. ఇతరులకు ఉపాధి కల్పించడంతో పాటు మీరు భారీగా సంపాదించవచ్చు.

Business Idea : సొంతంగా చేసే వ్యాపారాల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ పెట్టుబడితో ప్రారంభించడం మంచిది. అలాంటి వ్యాపారాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి అప్పడాల తయారీ వ్యాపారం. ఏడాది పొడవునా నడిచే వ్యాపారం ఇది. అప్పడాలు త్వరగా పాడవ్వవు కాబటి..నష్టాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వీటిని ఇంట్లోనే ఎలా తయారు చేయవచ్చు. మహిళలు స్వయం సహాయక బ్రుందాలుగా ఏర్పడి కూడా ఈ వ్యాపారం చేయవచ్చు. లేదా ఎవరైనా ఒక్కరే కూడా ఈ వ్యాపారం చేయవచ్చు. 

Add Zee News as a Preferred Source

ఈ వ్యాపారం విజయం సాధించాలంటే మొదటి చిట్కా..రుచి. మీరు చేసే అప్పడం రుచి అదిరిపోయేలా ఉండాలి. ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టకూడదు. చూడటానికి లుక్ అందంగా కనిపించాలి. చక్కటి ప్యాకింగ్ కూడా ఉండాలి. మీ అప్పడాలను ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో మిత్రులకు అమ్మడం ద్వారా వ్యాపారాన్ని నెమ్మదిగా ప్రారంభించవచ్చు.  తర్వాత షాపులు, హోటల్లకు సప్లయ్ చేసుకోవచ్చు. షామియానా, మ్యారేజ్ ఫంక్షన్ హాల్ వాళ్లతో డీల్స్ కుదుర్చుకున్నట్లయితే మంచి లాభాలను పొందవచ్చు. 

Also Read: IPL 2025: ధోనీని ఎంతైనా తిట్టుకోండి.. ఈ రికార్డు మాత్రం మీ ఫేవరెట్‌ ప్లేయర్‌ జన్మలో చేరుకోలేడు

ఇప్పుడు అప్పడాల్లో దాదాపు 50 రకాలు ఉన్నాయి. మీరు కూడా వాటన్నింటినీ చేయవచ్చు. కాకుంటే ముందుగా తక్కువ ధరకే లభించేలా చేస్తే ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు. తద్వారా మంచి లాభాలు వస్తాయి. ఇప్పుడు వాటి ధరను పెంచుకోవచ్చు. అప్పడాల తయారీకి ముడి పదార్థం యంత్రాన్ని కొనాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లేదా మార్కెట్లో ఈ యంత్రం కొనుగోలు చేయవచ్చు. 

అప్పడాల వ్యాపారాన్ని మీరు రూ. 2000తో ముడిసరుకు తెచ్చుకోవచ్చు. యంత్రం కోసం కొంత ఖర్చు అవసరం అవుతుంది. వీటితో చాలా రకాలు ఉన్నాయి. వీటి ధర రూ. 10వేల నుంచి రూ. లక్ష వరకు ఉంటుంది. మీ బడ్జెట్ ను బట్టి యంత్రం కొనుగోలు చేయవచ్చు. ఇలా ప్రారంభంలోనే మీకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ తర్వాత నెలలవారీ ఖర్చు తక్కువగానే ఉంటుంది. మీరు అప్పడాల తయారీని గ్రుహ వ్యాపారంగా చేయాలనుకుంటే లైసెన్స్ అవసరం లేదు. కానీ మీరు దీన్ని పెద్ద ఎత్తున చేయాలనుకుంటే లేదా మీ పేరున ఓ బ్రాండ్ పెట్టి అమ్మాలనుకుంటే మీరు fassi నుంచి వ్యాపార లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా తేలిక. మీ దగ్గరలోని ప్రభుత్వ ఆఫీసుకు వెళ్తే వాళ్లు మీకు పూర్తి వివరాలు చెబుతారు. 

Also Read:BRS Party Panchangam: మాజీ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ పంచాంగం ఎలా ఉందో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News