Business Ideas: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వ్యవసాయంపై ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా వివరణ అవసరం లేదు. ఆయన రాజకీయ జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, వ్యవసాయ పనులకు మాత్రం ఎప్పుడూ సమయం కేటాయిస్తారు. ఒక రైతు బిడ్డగా పుట్టి, రైతు మనసుతో జీవిస్తున్న ఆయన ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో స్వయంగా వ్యవసాయం చేస్తూ సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండిస్తున్నారు.
గతంలో కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో పసుపు, వెల్లుల్లి, ఆలుగడ్డలు, క్యారెట్, క్యాప్సికం వంటి అధిక డిమాండ్ ఉన్న పంటలను పండించారు. ఇప్పుడు ఆయన ఫామ్‌హౌస్ మళ్లీ పచ్చదనంతో కళకళలాడుతోంది. ఇటీవల కొత్త రకాల వరి వంగడాలను తెప్పించి పొలాల్లో నాట్లు వేయించారు. ఈ పంటలన్నీ పూర్తిగా ఆర్గానిక్ విధానంలో సాగు చేస్తున్నారు. రసాయనాల వినియోగం లేకుండా, సేంద్రియ ఎరువులు ఉపయోగించి పంటలను పండించడం ఆయన ఫామ్‌హౌస్ ప్రత్యేకత అని చెప్పాలి.
తాజాగా, ఆయన ఫామ్‌లో గ్లూకోస్ కంటెంట్ తక్కువగా ఉండే షుగర్ ఫ్రీ ధాన్యం ను పండిస్తున్నట్లు సమాచారం. ఇది ఆరోగ్యానికి మంచిదిగా, డయాబెటిస్ ఉన్న వారికి మేలుగా ఉండే ధాన్యంగా గుర్తింపు పొందింది. రైతులకు కూడా ఇది కొత్త అవకాశాల తలుపులు తెరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇవి మాత్రమే కాకుండా, కేసీఆర్ ఇప్పుడు వెల్లుల్లి పంటపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. వెల్లుల్లి మార్కెట్లో ఎప్పటికీ డిమాండ్ ఉన్న పంట. భారతదేశంలోనే కాదు, విదేశీ మార్కెట్లలో కూడా వెల్లుల్లి మంచి ధరకు అమ్ముడవుతుంది. ఒక ఎకరా భూమిలో వెల్లుల్లి సాగు చేస్తే సగటున రూ. 80 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకు లాభం వచ్చే అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతో అధిక లాభాలు ఇచ్చే పంటల్లో వెల్లుల్లి ఒకటి.
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఈ పంటలను సాగు చేస్తూ, రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న కేసీఆర్. కేవలం రాజకీయ నాయకుడే కాకుండా, ఆధునిక రైతు కూడా. ఆయన ఆర్గానిక్ పద్ధతులు, పంటల వైవిధ్యం, నూతన వంగడాలపై చూపుతున్న ఆసక్తి తెలంగాణ రైతులకు ప్రేరణగా మారింది. కేసీఆర్ సాగు చేస్తున్న పంటలు చూస్తే.. భూమి పట్ల ఉన్న ప్రేమ, ప్రకృతి పట్ల గౌరవం, రైతు జీవన విధానం పట్ల ఉన్న అంకితభావం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు కూడా వెల్లుల్లి లేదా ఆర్గానిక్ పద్ధతుల్లో పంటలు పండిస్తే.. అది కేవలం వ్యవసాయం కాదు, బంగారం పండించినట్లే అని చెప్పాలి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









