)
Business Ideas For Women: నేటి కాలంలో సోషల్ మీడియా అనేది కేవలం వినోదం కోసం మాత్రమే కాదు.. ఒక మార్కెటింగ్ శక్తిగా మారిపోయింది. అదే శక్తిని ఉపయోగించి అనేక మంది, ముఖ్యంగా మహిళలు, ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా మారి మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. ఇంటి వద్ద నుంచే స్మార్ట్‌ఫోన్ ద్వారా వ్యాపారం చేయడం, తమ ప్రతిభను చాటడం ఇదే నేటి ట్రెండ్‌గా మారింది.
ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల మహిళలు కూడా సోషల్ మీడియా శక్తిని ఉపయోగించి తమ జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు వ్యాపార అవకాశాల కేంద్రం అయ్యాయి. ఇన్ఫ్లుయెన్సర్గా మారడం ద్వారా మీరు ఒకే సమయంలో వ్యాపారం కూడా చేయవచ్చు, ఆదాయం కూడా పొందవచ్చు. ఇంటి వద్ద నుంచే చేయదగిన ఈ వ్యాపారం మహిళలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు.. మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపే రంగం చీరలు. అందమైన రంగులు, కొత్త డిజైన్లు, ట్రెండీ మోడల్స్ ఉన్న చీరలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పండలు, పెళ్లిలు, ఏ చిన్నఫంక్షన్ అయినా కొత్తచీర కొనాల్సిందే. మహిళల అభిరుచి తెలుసుకున్న చాలా మంది చీరల వ్యాపారం ప్రారంభించి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే మీరు కూడా దీన్ని బిజినెస్ ఐడియాగా మార్చుకోవచ్చు.
ముందుగా మీరు హోల్‌సేల్ మార్కెట్లో తక్కువ ధరకు చీరలను కొనుగోలు చేయాలి. తర్వాత ఆ చీరలను ఆకర్షణీయంగా చూపిస్తూ వీడియోలను తయారు చేయాలి. చీరల రంగులు, డిజైన్లు, క్వాలిటీ, ధర గురించి స్పష్టంగా వివరించాలి. ఈ వీడియోలను మీ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా ఫేస్బుక్ పేజీలో అప్లోడ్ చేస్తే మీ ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతుంది. మీరూ చూపించిన చీరలు నచ్చిన కస్టమర్లు నేరుగా సంప్రదించి చీరలను కొనుగోలు చేయవచ్చు. ఈ విధంగా మీకు రెండు రకాల ఆదాయం వస్తుంది.
1. సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా వచ్చే యాడ్స్ ద్వారా రెవెన్యూ వస్తుంది.
2. మీరు విక్రయించే చీరల వల్ల కూడా లాభం వస్తుంది. ఒక దెబ్బకు రెండు వైపుల నుంచి ఆదాయం అన్నమాట.
ఇలా కొద్దిపాటి పెట్టుబడితో, స్మార్ట్‌ఫోన్ సహాయంతో, మీరు మీ ఇంటినే ఒక చిన్న వ్యాపార కేంద్రంగా మార్చుకోవచ్చు. కొంత క్రియేటివిటీ, మార్కెటింగ్ సెన్స్, క్రమం తప్పని కంటెంట్ ఉంటే మీరు కూడా విజయవంతమైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగవచ్చు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook