Buy Term Insurance: జీవితంలో ఎప్పుడు, ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందో ఏమీ చెప్పలేము. కాబట్టి ప్రతి వ్యక్తి ఊహించని పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ పరిస్థితుల్లో కుటుంబానికి ఆరోగ్య బీమా, టర్మ్ బీమా, జీవిత బీమా మొదలైనవి సహాయకరంగా ఉంటాయి. అయితే, వాటి ప్రీమియంలు చాలా ఖరీదైనవి కాబట్టి పేదలు వాటిని కొనుగోలు చేయలేరు.
అలాంటి వారికి, ప్రభుత్వం అమలు చేసే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) సహాయకరంగా ఉంటుంది. ఇది మీరు లేనప్పుడు మీ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పథకం ప్రీమియం చాలా తక్కువగా ఉండటం వల్ల నెలకు రూ. 5000-10,000 సంపాదించేవారు కూడా దీన్ని సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ పథకానికి సంబంధించిన ప్రత్యేక విషయాలను తెలుసుకోండి.
ఈ ప్రభుత్వ పథకం కింద, పాలసీదారుడు మరణిస్తే, అతని కుటుంబానికి రూ. 2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ సహాయం కష్ట సమయాల్లో కుటుంబం అనేక అవసరాలను తీర్చగలదు. ఎవరైనా ఈ ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, వారు సంవత్సరానికి కేవలం రూ. 436 చెల్లించి ఈ పథకాన్ని కొనుగోలు చేయాలి. 436/12=36.3 అంటే ఒక వ్యక్తి ప్రతి నెలా రూ. 36 ఆదా చేసినా, అతను దాని వార్షిక ప్రీమియంను సులభంగా చెల్లించవచ్చు.
18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా ఈ బీమా పథకాన్ని కొనుగోలు చేయవచ్చు. PMJJBY బీమా పథకం కవర్ వ్యవధి జూన్ 1 నుండి మే 31 వరకు ఉంటుంది. అంటే మీరు సంవత్సరంలో ఏ నెలలోనైనా దీన్ని కొనుగోలు చేయవచ్చు. కానీ మీరు మే 31 వరకు మాత్రమే కవరేజ్ పొందుతారు. మీరు జూన్ 1న దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవాలి. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి. ఈ పథకం కింద నమోదు చేసుకునేటప్పుడు మీరు ఆటోమేటిక్ రెన్యూవల్‌ను ఎంచుకుంటే, ప్రతి సంవత్సరం మే 25, మే 31 మధ్య, పాలసీలోని రూ. 436 మీ ఖాతా నుండి ఆటోమెటిగ్గా డిలీట్ అవుతుంది.
ఈ పాలసీ తీసుకోవడానికి మీకు ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. బీమా పాలసీ సమ్మతి పత్రంలో కొన్ని అనారోగ్యాలు ప్రస్తావిస్తారు. మీరు ఆ అనారోగ్యాలతో బాధపడటం లేదని డిక్లరేషన్‌లో పేర్కొనాలి. మీ ప్రకటన తప్పు అని రుజువైతే, మీ కుటుంబానికి ఈ పథకం ప్రయోజనం లభించదు. దీనితో పాటు, ఈ పథకంలో బీమా ప్రీమియంగా జమ చేసిన మొత్తంపై సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.
మీరు ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే, మీకు ఖాతా ఉన్న బ్యాంకు నుండి దాని ఫారమ్ పొందవచ్చు. ఈ ఫారమ్ ద్వారా, పాలసీ కోసం తన ఖాతా నుండి డబ్బును తీసివేయడానికి ఖాతాదారుడు సిద్ధంగా ఉన్నాడా లేదా అనే దాని గురించి సమ్మతి తీసుకుంటారు. దీని తరువాత, బ్యాంకు మిగిలిన పనులన్నీ చేస్తుంది. ఇది కాకుండా, కొన్ని బ్యాంకులు నెట్ బ్యాంకింగ్ ద్వారా, మరికొన్ని SMS ద్వారా ఈ పాలసీ సౌకర్యాన్ని అందిస్తాయి.
నమోదు నిబంధనలు
-మీరు భారత ప్రభుత్వ ఈ పథకంలో దరఖాస్తు చేసుకోబోతున్నట్లయితే, మీ వద్ద ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్, మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో ఉండాలి.
-మీ గుర్తింపు ఆధార్ ద్వారా ధృవీకరించనందున మీరు మీ బ్యాంక్ ఖాతా నంబర్‌ను ఆధార్ నంబర్‌తో లింక్ చేయాలి.
-మీరు మీ బ్యాంకు ఖాతాలలో ఒకదాని ద్వారా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రయోజనాన్ని పొందవచ్చు. దీనితో పాటు, ఈ పాలసీని మరే ఇతర ఖాతాకు లింక్ చేయడానికి వీలులేదు.
-పాలసీ తీసుకున్న 45 రోజుల తర్వాత మాత్రమే బీమా కవర్ ప్రయోజనం లభిస్తుంది. అయితే, ప్రమాదం కారణంగా మరణం సంభవించినప్పుడు 45 రోజుల షరతు వర్తించదు.
నామినీ ఎలా క్లెయిమ్ చేయవచ్చు
-సంబంధిత వ్యక్తి బీమా చేసుకున్న బ్యాంకులో నామినీ క్లెయిమ్ చేసుకోవాలి. మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. డిశ్చార్జ్ రసీదుతో పాటు ఇతర అవసరమైన పత్రాలను ఇవ్వాలి. నిబంధనల ప్రకారం, ప్రమాదం జరిగిన 30 రోజులలోపు క్లెయిమ్ చేయడం అవసరం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









