Credit Card: క్రెడిట్ కార్డుతో బంగారం కొనవచ్చా? ఆర్బిఐ చెబుతోంది ఏంటీ? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Credit card gold:  బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. సామాన్యులు కూడా బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడింది. అయితే క్రెడిట్ కార్డు ఈమధ్య కాలంలో ప్రతిఒక్కరి దగ్గర ఉంటుంది. క్రెడిట్ కార్డును ఉపయోగించి బంగారాన్ని కొనుగోలు చేయవచ్చా  అనే సందేహం చాలా మందిలోనే ఉంటుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెబుతోంది..ఎలాంటి నిబంధనలను తీసుకువచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Apr 28, 2025, 06:50 PM IST
Credit Card: క్రెడిట్ కార్డుతో బంగారం కొనవచ్చా? ఆర్బిఐ చెబుతోంది ఏంటీ? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Credit card gold:   భారతదేశంలో బంగారానికి చాలా డిమాండ్ ఉంటుంది. పండగల సందర్భంలోనే కాదు..చేతిలో నాలుగు పైసలు ఉంటే బంగారం కొనాలనుకునేవారు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా మహిళలకు బంగారు ఆభరణాలు ధరించడం నుంచి శుభ సందర్భంగాల్లో మెడనిండా వేసుకుంటుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగించే దేశం భారతదేశమే. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగం చాలా వరకు పెరిగింది. ఈ కారణంగా గత కొన్ని రోజులుగా బంగారం ధర విపరీతంగా పెరిగిపోతోంది. 

Add Zee News as a Preferred Source

ముఖ్యంగా 2025 ప్రారంభం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు బంగారం  కొనలేని పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం కూడా ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలు తమ దగ్గర ఉన్న డబ్బుతో బంగారాన్ని  కొని పొదుపు చేస్తుంటారు. ఈ పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు ఉపయోగించి బంగారం  కొనడం సాధ్యమేనా? అలాగే దీని గురించి ఆర్బిఐ ఏం చెబుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

Also Read: Ather Energy IPO subscription: నేటి నుంచి ప్రారంభం కానున్న ఎథర్ ఎనర్జీ ఐపీవో, ప్రైస్ బ్యాండ్  ధర ఎంత, మినిమం ఎన్ని షేర్లు కొనాలి  

2013లో ఆర్బిఐ క్రెడిట్ కార్డులను ఉపయోగించి బంగారం కొనుగోలు చేయడంపై కొన్ని నిబంధనలను విధించింది. దీని ప్రకారం క్రెడిట్ కార్డుల ద్వారా చేసే బంగారు ఆభరణాల కొనుగోళ్లను నెలలవారీ వాయిదాలుగా మార్చరాదని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు బ్యాంకు శాఖల్లో బంగారు నాణేలను కొనుగోలు చేసేందుకు క్రెడిట్ కార్డుల వినియోగాన్ని కూడా నిషేధించింది. అయితే కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులను ఉపయోగించి బంగారం కొనుగోలుకు అనుమతి ఇచ్చాయి.

Also Read: Patanjali: పతంజలి గులాబీ షర్బత్ : లాభం కోసం కాదు, దేశ సేవ కోసం రూపొందించిన ఈ  షర్బత్  ప్రత్యేకతలు ఇవే  

అయితే 2018లో ఆర్బిఐ తిరిగి జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి ప్రస్తుతం ఏ బ్యాంకులు క్రెడిట్ కార్డులను ఉపయోగించి బంగారం కొనుగోలు చేయడానికి అనుమతించవు. కానీ కొన్ని కంపెనీలు క్రెడిట్ కార్డుతో బంగారం కొనుగోలు చేసినందుకు ఫీజులు వసూలు చేస్తాయి. దీని ప్రకారం మీరు బంగారం రూ. 1000 కంటే ఎక్కువగా ఉంటే ఫీజు చెల్లించాలి. అయితే ఆర్బిఐ ఆంక్షల కారణంగా క్రెడిట్ కార్డులను ఉపయోగించి బంగారం కొనలేమని మీరు గమనించాల్సి ఉంటుంది. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News