PF Money: కేంద్ర ప్రభుత్వం EPFO 3.0 ప్రవేశపెట్టేందుకు సిద్ధమౌతోంది. ఇదే జరిగితే పీఎఫ్ డబ్బుల్ని ఇకపై క్షణాల్లో ఏదో ఒక ఏటీఎం నుంచి ఇట్టే డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి డబ్బులు పొందవచ్చు.
ఈపీఎఫ్ఓ కార్యాలయం ఎప్పటికప్పుడు ఖాతాదారుల కోసం కొత్త సౌకర్యాలు అందిస్తోంది. ఇప్పుడు త్వరలో EPFO 3.0 లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి మన్సూఖ్ మాండవియా స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చాలా ప్రయోజనాలు పొందవచ్చు. రానున్న రోజుల్లో EPFO 3.0 డిజిటల్ సిస్టమ్ ఆవిష్కరించనున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈపీఎఫ్ఓ ఇకపై ఓ బ్యాంకులా పనిచేస్తుంది. మీకు నచ్చినప్పుడు ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బుల్ని విత్ డ్రా చేసుకోవచ్చు. యూఏఎన్ నెంబర్ ఆధారంగా పీఎఫ్ సభ్యులు సులభంగా డబ్బులు విత్ డ్రా చేసుకోగలరు. పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ఇకపై ఖాతాదారులు ఈపీఎఫ్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్ఓ 3.0 ప్రకారం పీఎఫ్ డబ్బులు పూర్తిగా మీ నియంత్రణలో ఉంటాయి. మీకు నచ్చినప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చు. ఎలాంటి ఫామ్స్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. హెచ్ఆర్ సంతకాల కోసం ఆఫీసుకు వెళ్లాల్సిన పని లేదు.
ఇంకా సులభంగా చెప్పాలంటే ఓ బ్యాంకు ఎక్కౌంట్ మాదిరి ఎప్పుడు అప్పుడు వాడుకోవచ్చు. ఏటీఎం నుంచి డబ్బుల్ని కావల్సిన మొత్తంలో విత్ డ్రా చేసుకోవచ్చు. అంటే పీఎఫ్ డబ్బుల కోసం నిరీక్షణ అవసరం లేదు. క్షణాల్లో డబ్బులు పొందవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ కూడా కొత్త యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అంటే EPFO 3.0 ద్వారా పేపర్ వర్క్ నుంచి ఉపశమనం పొందవచ్చు. క్షణాల్లో మీక్కావల్సిన మొత్తం మీ పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి తీసుకోవచ్చు. ఎవరి అనుమతి అవసరం లేదు. \
Also read: 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ నజరానా, 3 శాతం పెరగనున్న డీఏ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









