Pakistan Stock Market: ఓ వైపు ఆపరేషన్ సింధూర్ జరిగినప్పటికీ, భారత స్టాక్ మార్కెట్లు ఏమాత్రం చెక్కుచెదరకుండా స్థిరంగానే ఉన్నాయి. భారీగా అమ్మకాల ఒత్తిడి ఏమీ కనిపించలేదు. గురువారం మాత్రం కొద్దిగా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. కానీ మరోవైపు పాకిస్తాన్ కు చెందిన కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ మాత్రం దెబ్బకు క్లోజ్ అయిపోయింది.
కరాచీ సమీపంలో భారత సైనిక చర్య జరుగుతుందనే పుకార్ల తర్వాత పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ గురువారం ఆరు శాతానికి పైగా పడిపోయింది. ట్రేడింగ్ ఒక గంట పాటు ఆగిపోయింది . పుకార్లు నిరాధారమైనప్పటికీ, ట్రేడింగ్ నిలిపివేయబడటానికి ముందు KSE100 సూచీ 6,948 పాయింట్లు లేదా 6.32 శాతం పడిపోయి 1,03,060 పాయింట్లకు చేరుకుంది. ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో అప్పటినుంచి కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ రక్తం కక్కుతూనే ఉంది.
అసలే మూలుగుతున్న నక్క పైన తాటిపండు పడ్డట్టు ఉన్న కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్, తాజాగా భారత్ దాడితో ఇప్పుడు పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ తీవ్ర నష్టాల్లోకి జారుకుంది. నిజానికి పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ కరాచీ బేస్ గా నడుస్తుంది. నిజానికి మన దేశంలోని స్టాక్ మార్కెట్లతో పోల్చి చూస్తే పాకిస్తాన్ బేస్ గా నడిచే కరాచీ స్టాక్ ఎక్స్ చేంజ్ కేవలం నామ మాత్రం అనే చెప్పవచ్చు. 2025 మార్చి ముగింపు నాటికి, పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (PSX) మార్కెట్ క్యాపిటలైజేషన్ భారతీయ కరెన్సీలో సుమారు రూ.4.2 లక్షల కోట్లు మాత్రమే.
Also Read: Harrop Drone: ఈ ఒక్క డ్రోన్ తో పాకిస్తాన్ అంతం..మోదీ అమ్ములపొదిలో మెగా అస్త్రం
భారతీయ స్టాక్స్ ఎక్స్ ఛేంజ్ ఇండియా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 438.9 లక్షల కోట్లు. ఈ రెండు మార్కెట్ల మధ్య తేడా సుమారు రూ. 434.74 లక్షల కోట్లు, అంటే NSE మార్కెట్ క్యాప్, PSX కంటే సుమారు 105 రెట్లు ఎక్కువ. భారతదేశంలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినటువంటి కంపెనీల్లో ఒక కంపెనీ విలువ కూడా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ మొత్తం విలువ చేయదు. మనదేశంలో ఐదు లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ కలిగిన కంపెనీలు దాదాపు 10 వరకు ఉన్నాయి. ఇందులో అతి తక్కువగా ఐదు లక్షల కోట్ల సమీపంలో మార్కెట్ క్యాపిటల్ కలిగిన సంస్థ ఐటీసీ. ఒక్క ఐటీసీ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ తో కూడా కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తం సరితూగదు.
నిజానికి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థతో భారత అధిక వ్యవస్థకు పోలిక లేదు. మనదేశంలోని రిలయన్స్ గ్రూప్ మార్కెట్ క్యాపిటల్ దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇక టిసిఎస్ లాంటి ఒకే ఒక కంపెనీ దాదాపు 12 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటల్ కలిగి ఉంది. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ 14 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉన్నాయి.
Also Read: Operation Sindoor 2: పాక్ నగరాలపై దాడిలో గేమ్ ఛేంజర్లుగా కామికేజ్ ద్రోన్లు ఫీచర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









