)
World Cheapest Petrol Price Country: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, సుంకాల వివాదాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఈ మార్పుల ప్రభావం నేరుగా పెట్రోల్, డీజిల్ ధరలపై పడుతుంది. ఫలితంగా సాధారణ ప్రజల జేబులపై పెద్ద భారం పడుతోంది. చాలా కాలంగా భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదు. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర సుమారు రూ. 94.77 కాగా, డీజిల్ ధర వందకు పైగానే ఉంది. అనేక నగరాల్లో ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలోని కొన్ని దేశాల్లో పెట్రోల్ ధర ఒక నీటి బాటిల్ కంటే కూడా తక్కువగా ఉంది.
భారతదేశంలో ఒక లీటరు వాటర్ బాటిల్ ధర సుమారు రూ. 15–రూ. 20 ఉంటుంది. అయితే లిబియాలో పెట్రోల్ ధర అంతకంటే తక్కువగా ఉంది. అంటే, మీరు భారత్‌లో 20 రూపాయలకు ఒక వాటర్ బాటిల్ కొంటే.. లిబియాలో అదే డబ్బుతో సుమారు 8 లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేయవచ్చు. ఇది విన్న వారెవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
GlobalPetrolPrices.com ప్రకారం, ప్రపంచంలోనే చౌకైన పెట్రోల్ లిబియాలో లభిస్తోంది. అక్కడ ఒక లీటరు ధర కేవలం రూ. 2.43 మాత్రమే. రెండో స్థానంలో ఇరాన్ ఉంది. అక్కడ పెట్రోల్ లీటరు ధర రూ. 2.51. మూడో స్థానంలో వెనిజులా ఉంది. అక్కడ ధర రూ. 3.07గా ఉంది.
లిబియాకు ఎందుకు ఇంత చౌకగా ఇంధనం అందుబాటులో ఉందనే సందేహం మీలో రావచ్చు. ఆ దేశంలో అపారమైన చమురు నిల్వలు ఉన్నాయి. ఉత్తర ఆఫ్రికా దేశమైన లిబియా, ఉత్తరాన మధ్యధరా సముద్రం, తూర్పున ఈజిప్ట్ సరిహద్దులతో ఉంది. ఈ దేశంలో దాదాపు 48.3 ట్రిలియన్ బ్యారెళ్ల ముడి చమురు నిల్వలు ఉన్నాయి. అందువల్లే ప్రజలకు తక్కువ ధరలో ఇంధనం అందిస్తోంది.
ప్రపంచంలో చౌకగా పెట్రోల్ లభించే టాప్ 10 దేశాలు
లిబియా: ₹2.43/లీటరు
ఇరాన్: ₹2.51/లీటరు
వెనిజులా: ₹3.07/లీటరు
అంగోలా: ₹28.75/లీటరు
కువైట్: ₹30.26/లీటరు
అల్జీరియా: ₹31.26/లీటరు
ఈజిప్టు: ₹34.73/లీటరు
తుర్క్మెనిస్తాన్: ₹37.62/లీటరు
కజకిస్తాన్: ₹39.73/లీటరు
మలేషియా: ₹42.84/లీటరు
భారతదేశంలో మాత్రం ప్రజలు ఇంధన ధరలతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా కూడా, పన్నులు, సుంకాలు కారణంగా వినియోగదారులకు ఉపశమనం లభించడం లేదు. ఇక లిబియా, ఇరాన్, వెనిజులా వంటి దేశాలు మాత్రం అపారమైన సహజ వనరులు, తక్కువ పన్నుల కారణంగా పెట్రోల్‌ను ప్రజలకు దాదాపు ఉచితమేనన్నట్టుగా అందిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి