Get Up to Rs 90,000 Discount on Nissan Magnite: మన దేశంలో ఎస్‌యూవీలకు మాంచి క్రేజ్ ఉంది. దీని కారణంగానే ఇండియన్ మార్కెట్లో ఎస్‌యూవీల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. మీరు కూడా తక్కువ బడ్జెట్ లో మంచి ఎస్‌యూవీ కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లయితే.. నిస్సాన్ కు చెందిన మాగ్నైట్ ఎస్‌యూవీ గుడ్ ఛాయిస్ అనే చెప్పాలి. మాగ్నైట్ ఎస్‌యూవీపై నిస్సాన్ సంస్థ రూ.90,000 వరకు భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది. దీంతో మీరు ఈ కారును కేవలం రూ. 6 లక్షలకే ఇంటికి తీసుకెళ్లవచ్చు.
నిస్సాన్ మాగ్నైట్‌పై 90 వేల తగ్గింపు..
2022 సంవత్సరంలో తయారు చేయబడిన నిస్సాన్ మాగ్నైట్‌పై కంపెనీ గరిష్టంగా 90,000 తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ.12,000 ప్రీ మెయింటెనెన్స్ ప్యాకేజీ, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 20,000 యాక్సెసరీలు, రూ. 15,000 కార్పొరేట్ తగ్గింపు, రూ. 10,000 లాయల్టీ బోనస్, రూ. 2,000 ఆన్‌లైన్ బుకింగ్ బోనస్ ఉన్నాయి. ఇది కాకుండా, 2023లో తయారైన BS6 ఫేజ్ 1 మోడల్‌పై కూడా 71 వేల తగ్గింపును ఇస్తోంది. ఈ తగ్గింపులో రూ. 6,950 ప్రీ మెయింటెనెన్స్ ప్యాకేజీ, రూ. 20,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 12,000 యాక్సెసరీలు, రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు, రూ. 10,000 లాయల్టీ బోనస్, రూ. 2,000 ఆన్‌లైన్ బుకింగ్ బోనస్ ఉంటాయి.
ధర మరియు ఫీచర్లు..
నిస్సాన్ మాగ్నైట్ ధర రూ. 6 లక్షల నుండి రూ. 10.94 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉంటుంది. ఇది ఐదు వేరియంట్ ల్లో విక్రయించబడుతుంది XE, XL, XV ఎగ్జిక్యూటివ్, XV మరియు XV ప్రీమియం. నిస్సాన్ నుండి వచ్చిన సబ్ కాంపాక్ట్ SUV.. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED DRLలతో ఎల్ ఈడీ హెడ్‌లైట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్ మరియు పుడిల్ ల్యాంప్స్ వంటి లక్షణాలను పొందుతుంది. సేఫ్టీ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, హిల్-స్టార్ట్ అసిస్ట్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి.
Also Read: Hyundai Creta @ Rs 4 Lakhs: రూ. 4 లక్షలకే హ్యుందాయ్ క్రెటా.. షో రూమ్ ముందు క్యూ కట్టిన జనాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి