)
Crypto Investment India: క్రిప్టో కరెన్సీలను స్వాగతించటం అలాగే స్వీకరించటం విషయంలో భారత్ ప్రపంచంలోనే అత్యుత్తమ స్థానంలో కొనసాగుతోంది. వాస్తవానికి క్రిప్టోలు ఒక ప్రత్యేకమైన పెట్టుబడి సాధనంగా ప్రజల్లో నమ్మకాన్ని క్రమంగా పెంచుకోవటం దీనికి పరోక్షంగా దోహదపడుతోంది. వాస్తవానికి అమెరికా, ఇండియాలోని పెట్టుబడిదారులు ఈ విషయంలో చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. దీంతో 2025లో క్రిప్టోల్లో పెట్టుబడులు తారా స్థాయిలకు చేరుకున్నాయి. అమెరికా క్రిప్టోలను రెగ్యులేట్ చేయటంతో పాటు బిట్ కాయిన్ ఈటీఎఫ్స్ రాక పెద్ద మార్పులకు కారణంగా మారింది.
ఇటీవల విడుదలైన 2025 గ్లోబల్ అడాప్షన్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం.. భారత్, అమెరికాలు క్రిప్టోకరెన్సీ అడాప్షన్‌లో ప్రపంచంలో ముందున్నారు. ఛైనలిసిస్ విడుదల చేసిన ఈ ఆరో వార్షిక రిపోర్ట్‌లో 151 దేశాలను క్రిప్టో వినియోగం, వ్యవహారాల పరంగా ర్యాంకులు సృష్టించారు. భారతదేశం అన్ని ఉపకేటగిరీల్లో (రిటైల్, ఇనిస్టిట్యూషనల్, సెంట్రలైజ్డ్, డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్) టాప్‌లో నిలిచింది. భారతదేశంలో ఉన్న యువత, మొబైల్ యాక్సెస్, ఆర్థిక వ్యవహారాలపై పెరుగుతున్న అక్షరాస్యత కారణంగా ఈ విజయాన్ని భారత్ సాధించింది.
2025లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని దేశాలైన ఇండియా, పాకిస్థాన్, వియత్నాం వంటి దేశాల నుంచి పెద్ద ఎత్తువ ప్రజలు పెట్టుబడులకు ఆసక్తి చూపటం క్రిప్టోలను కొత్త శిఖరాలకు చేర్చుతోంది. ఇదే సమయంలో నార్త్ అమెరికా ప్రాంతం నుంచి కూడా పెట్టుబడుల ప్రవాహం అలాగే ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ భారీగా పెరిగింది. దీంతో జూన్ 2025లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో క్రిప్టోలు వేగంగా వృద్ధిని సాధిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ 1.4 ట్రిలియన్ డాలర్ల నుంచి 2.36 ట్రిలియన్ డాలర్లకు పెరిగినట్లు డేటా చెబుతోంది. ప్రధానంగా స్టేబుల్ కాయిన్స్ ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారుల నుంచి మంచి డిమాండ్ చూస్తున్నట్లు తేలింది.
వాస్తవానికి భారత్ 2025 గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్‌లో ప్రథమ స్థానాన్ని సాధించడం1990లలో ఇంటర్నెట్ తొలి దశలోని పరిస్థితులను గుర్తు చేస్తోందని ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజీ జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ అభిప్రాయపడ్డారు. అప్పట్లో కొద్దిమంది మాత్రమే ఇంటర్నెట్ వాడినప్పటికీ.. వారు ప్రస్తుతం ఉన్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బాట వేశారన్నారు. ఇప్పుడు ఆ స్థాయిలోనే క్రిప్టోకరెన్సీ వినియోగం దేశంలో ఒక కీలక మలుపులో నిలిచిందని చెప్పారు.
ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 11.5 కోట్లమంది డిజిటల్ ఆస్తుల క్రయవిక్రయాలు చేపడుతున్నారు. ఈ వినియోగం కేవలం 10% పెరిగినా.. ఆ సంఖ్య 14 కోట్లకు చేరుతుందని సుబ్బురాజ్ అన్నారు. అంటే భారతదేశంలోనే ఒక కొత్త "డిజిటల్ జాతి" పుడుతుందని ఆశిస్తున్నారు. ఇండెక్స్ వివరాలను స్పష్టంగా పరిశీలిస్తే.. క్రిప్టోల వాడకం కేవలం పట్టణాలు, టెక్నాలజీ కేంద్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. గ్రామీణ స్థాయిలోని ప్రజలు క్రిప్టో వైపు ఆకర్షితులవుతున్నారని తెలుస్తోంది. రిటైల్ వినియోగం నుంచి ఇన్స్టిట్యూషనల్ భాగస్వామ్యం, డీ-ఫై కార్యకలాపాల వరకు భారత్ ముందంజలో ఉందని ఈ డేటా స్పష్టం చేస్తోంది.
ఎలాగైతే ఇంటర్నెట్ భారత గ్లోబల్ పోటీ సామర్థ్యాన్ని మార్చిందో.. అలానే క్రిప్టోలు కూడా ఆర్థిక ప్రాప్యత, ఆవిష్కరణ, ధృడత్వానికి దారి తీస్తుందని జియోటస్ సీఈవో సుబ్బురాజ్ అభిప్రాయపడ్డారు. ఈ విజయంతో భారత్ గణాంకాల్లో మాత్రమే కాకుండా నిర్మాణాత్మకంగా కూడా క్రిప్టో పెట్టుబడుల విషయంలో ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థితిలో నిలిచిందని ఆశిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook