)
DeepSeek : ప్రపంచంలో సంచలనం సృష్టించిన స్టార్టప్ డీప్‌సీక్‌కు ఇప్పుడు చైనా 'జాతీయ నిధి' హోదాను ఇచ్చింది. దీని అర్థం చైనా ప్రభుత్వం ఇప్పుడు ఈ కంపెనీని తన విలువైన ఆస్తిగా చూస్తోంది. డీప్‌సీక్ తన R1 మోడల్‌ను సరసమైన ధరకే అభివృద్ధి చేసిందని.. పనితీరు పరంగా, ఇది OpenAIతో సహా అనేక అమెరికన్ కంపెనీల AI మోడళ్లను అధిగమించింది.
ప్రపంచ ద్రుష్టిని ఆకర్షించిన డీపీ సీక్ లో ఇప్పుడు కొత్త గుబులు మొదలైంది. ఉద్యోగులు ఎవరైనా కంపెనీ రహస్యాలను బయటపెడతారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో వారిని దేశం దాటి వెళ్లకుండా అడ్డుకుంటోంది. అంతేకాదు వాళ్ల పాస్ పోర్టులను సైతం లాగేసుకుంటుందని ది ఇన్ఫర్మేషన్ పేర్కొంది.
డీప్ సీక్ రేసులోకి వచ్చిన తర్వాత అమెరికా, చైనా మధ్య ఈ రంగంలో భారీగా పోటీ నెలకొంది. అప్పటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అమెరికాదే పైచేయిగా ఉంది. కానీ డీప్ సీక్ రంగ ప్రవేశంతో సీన్ పూర్తిగా మారిపోయింది. దీంతో చైనా ప్రభుత్వం కూడా డీప్ సీక్ ను జాతీయ సంపదగా భావిస్తోంది. డీప్ సీక్ లో ఎవరు పెట్టుబడులు పెట్టాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తోంది. కంపెనీని ఓ బంగారు బాతులా చూస్తోంది.
ముఖ్యంగా చైనాను దాటి అమెరికా వెళ్లొద్దని అక్కడి సర్కార్ ఏఐ పరిశోధకులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డీప్ సీక్ కు చెందిన సీనియర్ ఉద్యోగులు చైనా వంటి బయటికి వెళ్తే సున్నితమైన సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉందని డీప్ సీక్ మాత్రు సంస్ద హై ప్లయర్ భావిస్తోంది. దీంతో సదరు కంపెనీ, కొందరు ఉద్యోగుల పాస్ పోర్టులను స్దాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై డీప్ సీక్ ఇంతవరకు స్పందించలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe