)
Digital Life Certificate 2025: దేశవ్యాప్తంగా కోట్లాది మంది పెన్షనర్లకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. ఇప్పటి వరకు ప్రతి ఏడాది జీవన్ ప్రమాణ్ లేదా లైఫ్ సర్టిఫికేట్ కోసం పెన్షనర్లు బ్యాంకులు, ట్రెజరీ కార్యాలయాలు లేదా ప్రభుత్వ విభాగాలకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. కొందరికి వయస్సు కారణంగా బయటకు రావడం కష్టంగా మారేది. అయితే ఇప్పుడు ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం పెన్షన్, పెన్షనర్ సంక్షేమ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2025లో దేశవ్యాప్తంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రత్యేక ప్రచారం ప్రారంభించనుంది.
ఈ ప్రచారం నవంబర్ 1 నుండి 30 వరకు కొనసాగుతుంది. దేశంలోని దాదాపు 1,600 జిల్లాలు, సబ్-డివిజనల్ ప్రధాన కార్యాలయాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ఇందులో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌తో పాటు, పెన్షన్ చెల్లించే ప్రధాన బ్యాంకులు కూడా భాగస్వామ్యం కానున్నాయి. ఈ కేంద్రాల్లో అధికారులు పెన్షనర్లకు డిజిటల్‌గా జీవన్ ప్రమాణ్ సమర్పించడంలో సహాయం చేస్తారు. దీంతో ఇకపై పెన్షనర్లు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదు, బ్యాంకుల్లో క్యూలలో నిలబడే ఇబ్బంది తప్పుతుంది.
ప్రభుత్వం ముఖ్యంగా వృద్ధులను దృష్టిలో పెట్టుకుని అదనపు సౌకర్యం కూడా కల్పించింది. 80 సంవత్సరాలు పైబడిన పెన్షనర్లు అక్టోబర్ 1, 2025 నుంచే తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించగలరు. చలికాలంలో వృద్ధులు బయటకు వెళ్లడం కష్టతరమని భావించి ముందుగానే ఈ అవకాశం కల్పించనున్నారు. ఇది వారికి పెద్ద ఊరట కలిగించే నిర్ణయం. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడం ఇప్పుడు మరింత సులభం కానుంది. పెన్షనర్లు మొబైల్ ఫోన్ ద్వారానే ఇంట్లో కూర్చొని ముఖ గుర్తింపు (Face Authentication) ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఇందుకోసం రెండు ముఖ్యమైన యాప్‌లు డౌన్లోడ్ చేసుకోవాలి:
ఈ యాప్‌లు Google Play Storeలో ఉంటాయి. వీటిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఇమెయిల్ ID ఇవ్వాలి. తరువాత మొబైల్‌కి OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి ధృవీకరణ పూర్తి చేయాలి. అంతట తర్వాత ముఖాన్ని స్కాన్ చేస్తే జీవన్ ప్రమాణ్ ID, PPO నంబర్ లభిస్తాయి. వీటి సహాయంతో జీవన్ ప్రమాణ్ వెబ్సైట్ నుండి లైఫ్ సర్టిఫికేట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ కొత్త విధానం వల్ల పెన్షనర్లకు అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులు, దూర ప్రాంతాల్లో నివసించే వారు ఇకపై బ్యాంకులకు లేదా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సులభంగా ఇంట్లో నుంచే సర్టిఫికేట్ సమర్పించగలరు. దీని వలన సమయం ఆదా అవుతుంది, శ్రమ తగ్గుతుంది మరియు ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెరుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పెన్షనర్ల జీవనశైలిలో ఒక కీలక మార్పును తీసుకురానుంది. ఇకపై వర్షం, చలి, వేడి లేదా ఇతర కారణాల వల్ల బయటకు వెళ్లలేని పరిస్థితి ఉన్నవారికి ఇది నిజమైన వరంగా మారుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విధానం ద్వారా దేశవ్యాప్తంగా పెన్షనర్లకు పెద్ద సౌకర్యం కలుగుతుంది.
పెన్షనర్లు ఇప్పుడే Aadhaar Face RD, Jeevan Pramaan యాప్‌లను డౌన్లోడ్ చేసుకుని, నవంబర్ 2025 నుండి ఈ కొత్త సేవను ఉపయోగించడం ప్రారంభించాలి. ఇది కేవలం సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, ప్రభుత్వ సేవలలో ఆధునికత మరియు పారదర్శకతను కూడా పెంచుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.